ఓటీటీలోకి బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. 2 వారాలకే వస్తున్న దీన్ని ఎలా చూడాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ సినిమాలకు మాత్రమే చాలా కాలం పాటు ఆదరణ లభించింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ప్రేక్షకుల టేస్ట్‌లో చాలా తేడా వచ్చింది. అందుకే ఎన్నో డిఫరెంట్ కాన్సెప్టు మూవీలు వస్తున్నాయి. అందులోనూ ప్రయోగాత్మక సినిమాలు చాలానే రూపొందుతోన్నాయి. ఇటీవలే అలా వచ్చిన క్రేజీ మూవీనే 'ఆరంభం' (Aarambham).
'కేరాఫ్ కంచరపాలెం' చిత్రంలో తనదైన నటనతో అలరించిన మోహన్ భగత్ నటించిన తాజా చిత్రమే 'ఆరంభం'. ఎమోషనల్‌గా సాగే టైం ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మార్చి 10వ తేదీన ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

మోహన్ భగత్ హీరోగా అజయ్ నాగ్ తెరకెక్కించిన 'ఆరంభం' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ చిత్రం విఫలం అయిందనే చెప్పుకోవాలి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంలో కూడా ఇది ఫెయిల్ అయిపోయింది. తద్వారా ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయింది.
మోహన్ భగత్ హీరోగా నటించిన 'ఆరంభం' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈటీవీ విన్ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. వీటి కోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు కూడా ముట్టజెప్పింది. ఇక, విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా స్ట్రీమింగ్‌పై తాజాగా ఓ ఊహించని ప్రకటన వచ్చింది.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'ఆరంభం' మూవీని మే 23 నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకే ఇది స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నట్లు అయింది. ఇక, సినిమా హాళ్లలో కనిపించని ఈ చిత్రం కోసం సినీ ప్రియులు అందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. మోహన్ భగత్ హీరోగా చేసిన 'ఆరంభం' మూవీని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మించారు. ఇందులో సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు సింజిత్ ఎర్రమల్లి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











