OTTలోకి సూపర్ హిట్ కోర్టు డ్రామా.. కానీ తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చిన వెంకటేష్!
దృశ్యం, దృశ్యం 2 వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన జీతూ జోసఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాలు మలయాళంలోనే కాదు... తెలుగులోనూ సూపర్ హిట్టుగా నిలిచాయి. అయితే ఈ దర్శకుడు అదే కోర్డు డ్రామగా ఇటీవల నేరు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం వెంకటేష్ షాకిచ్చాడు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీతూ జోసెఫ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. దృశ్యం, దృశ్యం 2 చిత్రాల దర్శకుడు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక మలయళంలో మోహన్ లాల్ తో దృశ్యం సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు ఆ చిత్రాలతో సూపర్ హిట్టను అందుకున్నాడు. ఇక ఆ చిత్రాలను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి.. ఇక్కడ సూపర్ హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే.. జీతూ జోసేఫ్ తాజాగా మోహన్‌లాల్ కీలక పాత్రలో ఓ కోర్టు రూమ్ డ్రామా 'నేరు'ను తెరకెక్కించాడు. ఈ సినిమా డిసెంబరు 21న మలయాళంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా, రూ.80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది.
నేరు చిత్రంలో మోహన్‌లాల్, ప్రియమణి, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటించారు. వీరి నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్ స్టార్ వేదికగా జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఇప్పటికే మోహన్ లాల్, జీతూ జోసఫ్ కాంబోలో దృశ్యం సిరీస్ వచ్చి సూపర్ హిట్టు అయ్యాయి.
ఇప్పుడు నేరు చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చింది. ఈ సినిమా ఓటీటీ తెలుగు తప్ప తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రిలీజ్ కాకపోవడానికి కారణం వెంకటేష్ అని తెలుస్తోంది. వెంకటేష్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న వెంకటేష్ ఇప్పుడు నేరు చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నేరు చిత్రాన్ని తెలుగులో స్ట్రీమింగ్ చేయకూడదని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా లేదా అనేది చూడాలి.
ఇక నేరు చిత్ర విషయానికి వస్తే.. ఈ సినిమాకు పోటీగా సలార్, డంకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి. అయితే ఆ రెండు చిత్రాలను దాటుకుని 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ చిత్రం కూడా దృశ్యం సిరీస్ రేంజులోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఇది ఒక కోర్టు డ్రామాగా తెరెకెక్కింది.


Click it and Unblock the Notifications











