అనుకున్న తేదీకంటే ముందుగానే OTTలోకి రీసెంట్ పీరియాడికల్ థ్రిల్లర్.. ఎలా చూడాలంటే?

ఈ మధ్య కాలంలలో ఓటీటీలకు ఎంత క్రేజ్ ఎక్కువవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు, ఫేవెరట్ హీరోహీరోయిన్ల సినిమాలు అయితే తప్ప ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లల్లేదు. రీవ్యూలు, టాక్ విన్న తర్వాతే థియేటర్లకు వెళ్లాలా.. ఓటీటీలో చూసేయాని అని డిసైడ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో ఎక్కువగా ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలనే తీసుకు వస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా మరో పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా.. ఇటీవలే ఓ పీరియాడికలర్ థ్రిల్లర్ చిత్రం వచ్చింది. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేస్తూ... అందరినీ మెస్మరైజ్ చేసే ఈయన సరికొత్త కథాంశంతో వచ్చి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. అయితే ఈ సినిమా పేరే 'మలైకోటై వాలిబన్‌'. ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్భంగా థియేటర్లలో విడుదల చేశారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల అయి మంచి టాక్ యే తెచ్చుకుంది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని లిజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించారు.

Mohanlal Malaikottai Vaaliban Movie Official Streaming Date Confirmed Check Details

బ్రిటిష్‌ పరిపాలన కాలంలో.. స్వాతంత్రం కోసం అనేక మంది పోరాటం చేశారు. అయితే ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాన్ని మాత్రం చాలా స్పెషల్ గా ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రంలోమోహన్‌లాల్‌ రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో నటించగా... సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీ ఇతర కీలక పాత్రలు పోషించారు. సెంచురీ ఫిల్మ్స్, ఓవర్సీస్‌లో ఫార్ ఫిల్మ్ కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ కో ఎల్ఎల్సీలు కలిసి 65 కోట్లు రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

అయితే 'మలైకోట్టై వాలిబన్' ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ రిలీజ్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ డిజిల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేధికగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అయితే అంతా మార్చి 1వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని భావించగా.. అనుకున్న తేదీ కంటే ముందుగానే వచ్చేస్తూ సర్ ప్రైజ్ చేసింది.

Mohanlal Malaikottai Vaaliban Movie Official Streaming Date Confirmed Check Details

అయితే మలైకోటి వాలిబన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన చిత్రబృందం.. ఏయే భాషల్లో అందుబాటులోకి తీసుకు వస్తుందో మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా అనుకున్న తేదీ కంటే ముందుగా వస్తున్న ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆగితే చాలు.. ఈ చిత్రాన్ని నేరుగా ఇంట్లోనే కూర్చుని.. విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X