OTTలోకి రీసెంట్ పిరియాడికల్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి మరో కొత్త పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. సినిమా ప్రేమికులకు యాక్షన్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలంటే మక్కువే. ఇక అలాంటి చిత్రమే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన మలైకోటై వాలిబన్ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది.. ఎప్పుడు విడుదల కానుందో ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పంథా భిన్నమైనదనే విషయం తెలిసిందే. ఆయన ఓ తరహా పాత్రలకు ఎప్పుడూ పరిమితం కాలేదు.. అందుకే ఆయన కంప్లీట్ యాక్టర్ అనే పేరును సొంతం చేసుకున్నారు. ప్రయోగాత్మక కథలు, చారిత్రక చిత్రాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే మోహన్ లాల్... ఇటీవల నటించిన పీరియాడిక్ సినిమా 'మలైకోటై వాలిబన్‌'. ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే జనవరి 25 తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

Mohanlal Malaikottai Vaaliban Streaming on Disney Plus Hotstar OTT From March 1st Full Details Here

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం 'మలైకోట్టై వాలిబన్' తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ అయింది. 'మలైకోట్టై వాలిబన్' తెలుగు అర్థం 'మాలై కోట్టై ప్రాంతానికి చెందిన యువకుడు' అని. ఇక ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలకు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సినిమా భారీ అంచాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో మోహన్‌లాల్‌ నటించగా... సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీ ఇతర కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఈ సినిమా దాదాపు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇక ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Mohanlal Malaikottai Vaaliban Streaming on Disney Plus Hotstar OTT From March 1st Full Details Here

అయితే 'మలైకోట్టై వాలిబన్' ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ రిలీజ్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా 'డిస్నీ+హాట్‌స్టార్‌'లో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ఇక మలైకొట్ట వాలిబన్ సినిమా ఓటీటీలోనూ హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారట. అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. థియేటర్లలో మోస్తరు ఫలితం అందుకున్న సినిమాలు సైతం ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో సెంచురీ ఫిల్మ్స్, ఓవర్సీస్‌లో ఫార్ ఫిల్మ్ కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ కో ఎల్ఎల్సీ నిర్మించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X