OTT Release ఓటీటీలోకి మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. పిరియాడిక్ మూవీని ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ నటించిన పిరియాడిక్ చిత్రం మలైక్కొట్టై వాలిబాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రముఖ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సెరీ రూపొందించిన ఈ చిత్రం జనవరి 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా క్రేజ్ తగినట్టుగా, మోహన్ లాల్ స్టామినాకు తగినట్టుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు? ఏ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజవుతున్నదనే వివరాల్లోకి వెళితే...

మలైకొట్టై వాలిబాన్ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను భారీగా జొప్పించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ డబుల్ రోల్‌ను ప్లే చేశారు. యుద్ధ సైనికుడిగా ఆయన పెర్ఫార్మెన్స్ సినీ క్రిటిక్స్ మెప్పించింది.

Mohanlals thriller Malaikkottai Vaaliban Sets OTT Release on Disney Hotstar

మలైక్కొట్టై వాలిబాన్ చిత్రం భారీ అంచనాలతో థియేటర్‌లోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలకు దిగువన ఉండటంతో బాక్సాఫీస్ వద్ద అనుకొన్నంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ మూవీ మలయాళంలో 13 కోట్ల రూపాయలు, కన్నడలో 1.5 కోట్లు, తెలుగులో 50 లక్షలు, తమిళంలో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 60 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 17 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

ఇక థియేట్రికల్ రన్ ముగించుకొన్న మలైకొట్టై వాలిబన్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. మోహన్ లాల్, సొనాలీ కులకర్ణి, హరీష్ పేరడీ, డానిష్ సెత్ నటించిన ఈ సినిమా హక్కులను డిస్నీ హాట్ స్టార్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నది.తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డిస్నీ హాట్ స్టార్ రంగం సిద్దం చేసింది.

Mohanlals thriller Malaikkottai Vaaliban Sets OTT Release on Disney Hotstar

బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ హిట్ సాధిస్తుంది? ప్రేక్షకుల మెప్పు సాధింంచి అత్యధిక వ్యూస్ సాధిస్తుందా? అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X