OTT: ఓటీటీలోకి ప్రపంచం ఎదురు చూస్తున్న కొరియన్ వెబ్ సిరీస్.. సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

వరల్డ్ వైడ్ గా భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థల్లో వరల్డ్ నెంబర్ 1 స్ట్రీమింగ్ యాప్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. కాగా ఇందులో అనేక భాషలు అనేక ఇండస్ట్రీస్ సంబంధించి సాలిడ్ కంటెంట్ తో అలరించే నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ గా హిట్ అయ్యిన కంటెంట్ కూడా చాలానే ఉంది. అయితే ఈ కంటెంట్ లో అప్పుడు రాబరీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్పానిష్ భాషకి చెందిన "మనీ హేస్ట్" భారీ మొత్తం వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన సిరీస్ గా రికార్డులు నమోదు చేయగా ఆ తర్వాత వచ్చింది ఒక కొరియన్ సిరీస్ "స్క్విడ్ గేమ్".

అప్పటికే ఓటిటిలో కొరియన్ సిరీస్ లు కంటెంట్ కి ఆదరణ ఊపందుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ స్క్విడ్ గేమ్ అనే సిరీస్ గ్లోబల్ గా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఒక ఊహించని జానర్ లో దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యూక్ తీసుకొచ్చిన ఈ సిరీస్ ఇంకా రీజనల్ భాషల్లో కూడా రాకుండానే మనీ హేస్ట్ సహా ఇతర సిరీస్ ల తాలూకా రికార్డులు అన్ని బద్దలు కొట్టేసింది.

Most Awaited Squid Game 2 Web Series release date announced Here is the streaming date and platform

కాగా ఆ తర్వాత రీజనల్ భాషల్లో కూడా సిరీస్ అందుబాటులోకి వచ్చి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎప్పుడో 2021 లో వచ్చిన మొదటి సీజన్ కి రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. కాగా ఈ సస్పెన్స్ కి ఫైనల్ గా స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫిక్స్ నేడు తెర దించేశారు. ఈ అవైటెడ్ సిరీస్ పై ఒకటి రెండు బిగ్ అప్డేట్స్ ని నేడు వారు రివీల్ చేశారు.

సీజన్ 2 ని ఈ ఏడాదిలోనే డిసెంబర్ 26న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ఫ్యాన్స్ కి బిగ్ రిలీఫ్ ని అందించారు. ఇక దీనితో పాటుగా ఇదే ఫైనల్ సీజన్ కాదు మరో సీజన్ కూడా ఉందంటూ క్రేజీ ట్విస్ట్ ఇచ్చి ఆ ఫైనల్ సీజన్ ని వచ్చే ఏడాదిలోనే అంటే 2025 లోనే తీసుకొస్తున్నట్టుగా తెలియజేసారు. ఒక్క సీజన్ కి ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నారు అనుకునేవారికి గ్యాప్ తీసుకున్నా కూడా రెండు సీజన్లను ఒక్క ఏడాదిలోనే అందిస్తున్నారని చెప్పడం మాత్రం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Awaited Squid Game 2 Web Series release date announced Here is the streaming date and platform

కాగా ఈ సిరీస్ ఈసారి కొత్త కొత్త పాత్రలతో పరిచయం కాబోతుండగా మరింత వైలెంట్ గా ఉండేలా కనిపిస్తుంది. డబ్బులు కోసం ఒక గేమ్ షోలోకి వెళ్లిన వందలాది మంది వారిని వారే చంపుకోవడం లేదా గేమ్ లో భాగంగా గేమ్ షో వారే చంపడం వంటివి ఒకింత క్రూరంగా ఈ తరహా కంటెంట్ ని కోరుకునేవారికి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

ఇలా సీజన్ 1 అంత పెద్ద హిట్ కాగా ఇప్పుడు సీజన్ పై అంత క్రేజ్ నెలకొంది. ఇక ఈ రానున్న సిరీస్ లో ఎలాంటి వైలెంట్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్ ఉండబోతుంది అని సిరీస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే నేడు విడుదల చేసిన టీజర్ లో కూడా గేమ్ సోలో ఉండే వాళ్ళని ఎలా చంపేస్తున్నారో కూడా వినూత్నంగా చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X