ఓటీటీలో రికార్డు డీల్స్.. అత్యధిక ధరకు అమ్ముడైన తెలుగు సినిమాలు ఇవే!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ మార్కెట్ భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు సినిమా విజయాన్ని కేవలం థియేటర్ కలెక్షన్లతో మాత్రమే కొలిచేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. చాలా సినిమాలు విడుదలకు ముందే డిజిటల్ హక్కుల ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. కొన్ని పెద్ద సినిమాలైతే థియేటర్ కలెక్షన్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఓటీటీ డీల్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటున్నాయి. అలా ఇప్పటి వరకు భారీ ధరకు అమ్ముడైన తెలుగు ఓటీటీ సినిమాలు వివరాలు. అందులో ఇప్పుడు వరకు అత్యధిక ధరకు అమ్ముడైన టాప్-5 ఓటీటీ డీల్స్ గురించి వివరంగా చూద్దాం.
RRR (2022)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా RRR. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ ఫిక్స్ (Netflix) సుమారు రూ. 300 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఇది భారీ ఓటీటీ డీల్‌గా నిలిచింది.

కల్కీ 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas)హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.1200 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)సుమారు రూ. 375 కోట్లకు కొనుగోలు చేసిందట.
AA22xA6 Movie
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబిలో మూవీ AA22xA6. పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట. ఈ మూవీని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకునేందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
వారణాసి
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా 'వారణాసి'.ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి స్టార్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ మూవీని ఏకంగా 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1361 కోట్లు) బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. నివేదికల ప్రకారం..ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 650 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఇది ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఓటీటీ డీల్‌గా నిలవొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
స్పిరిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో డార్లింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరగ్గా.. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ.160 కోట్లకు లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డీల్ అఫీషియల్ గానే ముగించుకున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
పెద్ది
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబో మూవీ పెద్ది (Peddi). రా మాస్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా 'పెద్ది' నాన్-థియేట్రికల్ బిజినెస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ టాక్ ప్రకారం పెద్ది మూవీకి సంబంధించిన OTT రైట్స్ ఇప్పటికే దాదాపు రూ.115 కోట్లకు అమ్ముడయ్యాయట. ఆడియో హక్కులు మరో రూ.18 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం.
డ్రాగన్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన సినిమా డ్రాగన్. ఆ కాంబోకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డ్రాగన్ ఓటీటీ రైట్స్ దాదాపు రూ. 140 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఈ డీల్ ఇంకా పెద్ద మొత్తంలోనే ఉండొచ్చని అంచనా.
ఉస్తాద్ భగత్ సింగ్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్‌సింగ్'. ఈ మూవీ ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.ఇక డిజిటల్ బిజినెస్ విషయానికి వస్తే..'ఉస్తాద్ భగత్‌సింగ్' ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పవన్ గత చిత్రం 'ఓజీ' ఓటీటీలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో ఈ డీల్ చాలా సులువుగా క్లోజ్ అయిందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











