Top 10 Web series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ లు.. వాటిని మీరు చూశారా?

OTT Movies: ఇటీవల ఓటీటీ కంటెంట్ కు ఆదరణ పెరిగిపోతోంది. సినిమాలు, షోలు, సీరీస్ లు ఇలా డిఫరెంట్ కంటెంట్ తో ఓటీటీలు అందుబాటులోకి వస్తున్నాయి. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అందిస్తున్నాయి. దీంతో రోజురోజుకు ఓటీటీ కంటెంట్ ను చూసేవారి సంఖ్య గమనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా ఓర్మాక్స్ మీడియా (Ormax Media) మీడియా గత వారం (2024, జనవరి 13 నుంచి 19 వరకు) వివిధ ఓటీటీ వేదికల్లో అత్యంత వ్యూస్ అందుకున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అవేంటో మీరు కూడా ఓ లూక్కేయండి..

ఓర్మాక్స్ (Ormax Media) మీడియా 2024 జనవరి 13 నుంచి 19 వరకు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై అత్యధికంగా వీక్షించిన వెబ్ సీరీస్, సినిమాల వివరాలను వెల్లడించింది. ఓటీటీ లో క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే ఏ జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు అయిన ఓటీటీ ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అలా క్రైమ్ త్రిల్లర్ గా వచ్చిన 'పాతాళ్ లోక్ ఎస్ 2 (Paatal Lok 2)' మొదటి స్థానంలో నిలిచింది.

Most watched top 10 web series in India by ormax media have you watched it

'పాతాళ్ లోక్ 2' అనే సిరీస్ గత వారం రోజుల్లో 4.2 మిలియన్‌ వ్యూస్ సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ కు ఈ సిరీస్ సిక్వెల్ గా వచ్చింది. ఈ సిరీస్ లో జైదీప్ అహ్లావత్, అనిందిత బోస్, నిహారిక దత్, స్వస్తిక ముఖర్జీ, ఈశ్వక్ సింగ్, అభిషేక్ బెనర్జీ, అక్షయ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తరువాత స్థానంలో సోనీ లైవ్ లో స్టీమింగ్ అవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 4 అనే రియాలిటీ టెలివిజన్ సిరీస్ లో నిలిచింది. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో జనవరి 6 నుంచి సోనీ LIV లో సీజన్ 4 ప్రసారం అవుతోంది. గత వారం రోజుల్లో ఈ రియాలిటీ టెలివిజన్ సిరీస్ 4.0 మిలియన్ వ్యూస్ తో 2 స్థానంలో నిలిచింది.

గుణా ఎస్ 2 అనేది టీవీ షో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో గత వారం రోజుల్లో 3.4 మిలియన్స్ అందుకుని మూడవ స్థానంలో నిలిచింది. ఇక 4 వ స్థానంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ' బ్లాక్ వారెంట్' నిలిచింది. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ గత వారం రోజుల్లో 3 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇక ఐదవ స్థానంలో డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'పవర్ ఆఫ్ పంచ్ ' సిరీస్‌ నిలిచింది. జనవరి 17 నుంచి ప్రసారం అవుతోన్న ఈ సిరీస్‌లో రివా అరోరా, జైవీర్ జునేజా, ఆదిత్య అరోరా, బియాంకా అరోరా, యష్ సెహగల్, బర్ఖా బిష్త్ మరియు ఊర్వశి ధోలాకియా లు నటించారు. ఈ సిరిస్ గత వారం రోజుల్లో 2.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్న బీస్ట్ గేమ్ 6 వ స్థానంలో నిలిచింది. బీస్ట్ గేమ్స్ అనేది రియాలిటీ షో.. షో వారం రోజుల్లో 2.7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక అమెజాన్ ఫైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆగ్రా ఆఫైర్ అనే రొమాంటిక్ డ్రామా వారం రోజుల్లో 2.4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 7 వస్థానంలో నిలిచింది. ఇక చిదియా ఉద్ ( అమెజాన్ ఫ్రైమ్) 2.3 మిలియన్ వ్యూస్ తో 8 వ స్థానంలో నిలిచింది.

ఇక నెట్ ప్లిక్స్ లో ప్రసారం అవుతున్న కొరియన్ డ్రామా అయిన 'స్కాడ్ గేమ్ ఎస్ 2' కూడా మంచి అదరణ వస్తుంది. ఈ కొరియన్ డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ గత వారంలో 2.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 9 వ స్థానంలో నిలిచింది.ఈ సిరీస్ ను హ్వాంగ్ డాంగ్-హ్యూక్ రూపొందించారు. ఇక అమెజాన్ మాక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ అవుతున్న ఎక్ ఫర్జీ లవ్ స్టోరీ 1.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 10 వ స్థానంలో నిలిచింది. ఈ లవ్ స్టోరీలో అన్షుమాన్ మల్హోత్రా, రీమ్ సమీర్ షేక్, మోహిత్ హీరానందాని ప్రధాన పాత్రలో నటించారు.

More from Filmibeat

Read more about: top 10 web series ormax media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X