మోతేవరి లవ్ స్టోరి వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో.. ఎప్పుడంటే? గుడ్ లక్ చెప్పిన గంగవ్వ
యూట్యూబ్‌లో మై విలేజ్ షో షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న అనిల్ జీలా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్‌ను శివకృష్ణ బుర్రా రూపొందించారు. ఈ చిత్ రంలో అనిల్ జీలాకు జంటగా వర్షిణిరెడ్డి జున్నుతుల నటించారు. హాస్య ప్రధానంగా సాగే కుటుంబ కథగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ వెబ్ సిరీస్ గురించిన వివరాలు, కథ ఏమిటి? ఈ వెబ్ సిరస్‌ను ఓటీటీలో ఎక్కడ చూడాలనే వివరాల్లోకి వెళితే.
తెలంగాణ యాస, భాష, మాండలికంగా ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు మోతేవరి లవ్ స్టోరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిజేశారు. ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ కావాలని కోరుకొన్నాడు.

తెలంగాణలోని లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, స్వర్గస్తులైన తండ్రి ఓ మహిళకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) జంట, ఈ భూ వివాదం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సాగే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించేలా ఉంటుంది. ఈ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.
పెళ్లి చుట్టూ తిరిగే ఈ డ్రామా ఆద్యంత ఆలరించేలా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్నది. గ్రామీణ నేపథ్యంతో సాగే కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్‌లో అనేక ట్విస్టులు ఉండబోతోన్నాయి. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఈ సిరీస్‌లో ఆకట్టుకోనుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. మోతెవరి లవ్ స్టోరీ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి అని ఆనంద్ దేవరకొండ అన్నారు.
ఈ కార్యక్రమంలో జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జీ5 వైస్ ప్రెసిడెంట్ జయంత్, గంగవ్వ, నిర్మాత మధుర శ్రీధర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ కానున్నది అని గంగవ్వ తెలిపారు.


Click it and Unblock the Notifications











