OTTలో ఫ్రైడే ఫెస్టివల్... ఒక్కరోజే 23 సినిమాలు.. ఆ మూడింటిపైనే ఫోకస్!

ఓటీటీ వేదికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానికి కారణం ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడటం. ఇక అందుకు తగ్గట్లుగానే ఓటీటీ సంస్థలు సైతం కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ప్రతి వారం అలరిస్తూనే ఉన్నారు. ఇక శుక్రవారం వస్తే.. అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో పండగే అని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయనుండగా.. ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే 23 సినిమాలు, వెబ్ సీరిసులు రిలీజ్ కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

దసరా పండగ రాకముందే ఓటీటీ ప్రేక్షకులకు సినిమాల పండగ వచ్చేసింది. ఇక థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేస్తుండగా.. ఓటీటీలో కూడా సినిమాల సందడి మొదలైంది. ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 23 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అటు థియేటర్లలో 800, సిద్ధార్థ్ చిన్నా, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్, నితిన్ నార్నే మ్యాడ్, మంత్ ఆఫ్ మధు, మామ మశ్చింద్రా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీలో ఏకంగా 23 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Mr. Pregnant, Gadar 2 List Of OTT Movies Web Series Released On October 1st Week 2023

ఇక ఓటీటీలో ముఖ్యంగా ఆ మూడు సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. సన్నీ డియోలో నటించిన గదర్ 2 సినిమా ఈ శుక్రవారమే ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తెలుగు సినిమాల్లో ది గ్రేట్ ఇండియన్ కిచెన్, మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక రెజీనా నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆహాలో రిలీజ్ కానుండగా.. మిస్టర్ ప్రెగ్నెంట్ ఆహా, అమెజాన్ ఓటీటీల్లో రిలీజ్ కానుంది.

Mr. Pregnant, Gadar 2 List Of OTT Movies Web Series Released On October 1st Week 2023

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే....

ఆహా:
1. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు)- అక్టోబర్ 6న స్ట్రీమింగ్
2. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌:
3. బాలెరినా - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
4. ఫెయిర్‌ ప్లే - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
5. ఇన్‌సీడియస్‌: ద రెడ్‌ డోర్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
6. ఎ డెడ్లీ ఇన్విటేషన్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

Mr. Pregnant, Gadar 2 List Of OTT Movies Web Series Released On October 1st Week 2023

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:
7. ముంబై డైరీస్‌ (రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
8. టోటల్లీ కిల్లర్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
9. డిస్పరేట్లీ సీకింగ్‌ సోల్‌మేట్‌: ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ యూనివర్స్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

హాట్‌స్టార్‌:
10. లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్ (ప్రతివారం కొత్త ఎపిసోడ్‌ రిలీజ్‌)
11. ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
12. క్యాంపింగ్‌ ఔట్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
13. చిప్స్‌ అహోయ్‌- అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
14. ఓల్డ్‌ మెక్‌డొనాల్డ్‌ డక్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
15. వింకెన్‌, బ్లింకెన్‌ అండ్‌ నాడ్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
16. వెన్‌ ద క్యాట్స్‌ అవే - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
17. ఫిడ్‌లింగ్‌ అరౌండ్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

Mr. Pregnant, Gadar 2 List Of OTT Movies Web Series Released On October 1st Week 2023

జీ5:
18. గదర్ 2 - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

జియో సినిమా:
19. గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

లయన్స్‌ గేట్‌ ప్లే:
20. జాయ్‌ రైడ్‌ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్
21. మింక్స్‌ ( రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

సినీ బజార్ :
22. నీ వెంటే నేను - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

బుక్ మై షో
23. ఆస్టరాయిడ్ సిటీ - అక్టోబర్‌ 6న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X