OTTలోకి డైరెక్టుగా మృణాల్ ఠాకూర్ పిరియాడికల్ మూవీ... ఎందులో చూడాలంటే?
ఓటీటీ వేదికలు కొత్త కొత్త కంటెంట్ తీసుకువస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలే కాకుండా.. డైరెక్టు ఓటీటీలో కొత్త సినిమాలు, సీరిసులు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ నటించిన ఓ కొత్త మూవీ ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టార్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవ్వనుందో అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమానే అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తో కలిసి నటించాడు. ధడక్ సినిమా బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అమాయకపు చూపులతో ఇషాన్.. తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ ఇషాన్ కు మంచి సూపర్ హిట్ మాత్రం ఇప్పటి వరకు పడలేదు.

ఇక ఇషాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పిప్పా. ఇక ఈ చిత్రంలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. నాని హాయ్ నాన్న సినిమాతో పాటు.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఇటు తెలుగులో ఫుల్ బిజిగా ఉంటునే.. అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అందులో బాగంగానే పిప్పా అనే మూవీ చేసింది.
పిప్పా మూవీ ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది. ఇక ఈ సినిమా 1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా రూపొందింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్‍కు భారత్ సహకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించగా.... రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇక పిప్పా మూవీ డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. పిప్పా సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది. యుద్ధంలో కెప్టెన్ బలరామ్ మెహతా చూపిన దేశభక్తి, పోరాటపటిమను ఈ సినిమాలో మేకర్స్ అద్భుతంగా చిత్రీకరించారు.
ఇక ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, ప్రియాన్షు పైన్యులీ, సోనీ రజ్దాన్ కూడా కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఆర్ఎస్‍వీపీ బ్యానర్‌పై రోనీ స్క్రీవాలా, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్టుగా రిలీజ్ కానుంది. మీరు మంచి పిరియాడికల్ మూవీ చూడాలి అనుకుంటే కనుక ఈ చిత్రాన్ని ఓటీటీలో ఇంట్లోనే చూసేయండి.


Click it and Unblock the Notifications











