MSVPG OTT: ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్‌గారు'సందడి - మెగాస్టార్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mana Shankara Varaprasad Garu OTT: మెగాస్టార్ చిరంజీవి - హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు( Mana Shankara Vara Prasad Garu) . సంక్రాంతి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే యూనానిమస్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఎవరూ ఊహించని విధంగా కేవలం ఆరు రోజుల్లో అన్ని సెంటర్స్ ల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రస్తుతం లాభాల బాటలో పరుగులుపెడుతోంది. ఇక ఇప్పటివరకు ధియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టబోతుంది.

బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు
చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మన శంకర వరప్రసాద్ గారు మొదటి వారంలోనే దాదాపు రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 25 రోజుల్లో రూ.375 కోట్ల మార్క్‌ను దాటింది. దీంతో సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాల్లో ఆల్‌టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ మూవీ సుమారు 5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక బుక్ మై షో వంటి టికెట్ ప్లాట్‌ఫాంలలో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుబోయాయి.

MSVPG OTT Chiranjeevi Blockbuster Mana Shankara Vara Prasad Garu to Stream on ZEE5 from Feb 11

కథ పరంగా చూస్తే... జాతీయ భద్రతా అధికారిగా చిరంజీవి ప్రయాణం, తన దూరమైన కుటుంబాన్ని రక్షించుకుంటూ ప్రేమ, బాధ్యత, విమోచనాన్ని తిరిగి కనుగొనే ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా సాగుతుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమపాళ్లలో మిక్స్ చేసిన అనిల్ రావిపూడి మార్క్ నేరేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ స్టార్ వెంకటేష్ అతిథి పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే వీటీవీ గణేశ్‌, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్‌ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటించారు.

బడ్జెట్ - ఓటీటీ డీల్ వివరాలు
చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్‌ హోం బ్యానర్‌ గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్టు ట్రేడ్ టాక్. డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ గ్రూప్ సుమారు రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ హిట్ నుంచి ఓటీటీ సందడి
తాజాగా ఈ మెగా బ్లాక్‌బస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి రెస్పాన్స్ రాబట్టుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 (ZEE5)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేకత ఏమిటంటే - తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ, ఓటీటీలో కూడా కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X