OTTలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. అనుక్షణం ఉత్కంఠ రేపే దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మరీ ఎక్కువ అయింది. సినిమాలతో పాటు స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రియులు కూడా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లను ఎక్కువగా చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు.
అందులోనూ ఎక్కువగా హార్రర్, క్రైమ్, సస్సెన్స్, థ్రిల్లర్ కథలతో పాటు కామెడీ సిరీస్ లను ఎక్కువగా తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక వెబ్ సిరీస్ లు ఉండగా.. తాజాగా మరో క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివానీ రఘువంశీలు ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యే మర్డర్ ఇన్ మహిమ్. ఈ వెబ్ సిరీస్ లో సీఐడీ సీరియల్ లో హెడ్ గా కనిపించి మెప్పించిన ప్రత్యుమ్న.. శివాజి శాతమ్ కూడా కనిపించబోతున్నారు. అలాగే దివ్య, స్మితా తాంబే, రాజేష్ ఖత్తర్, బెనాఫ్ష సూన్ వాలా లు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ జియో సినిమా వేదికగా ఈ మర్డర్ ఇన్ మహిమ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మే 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ జియో సినిమా వేదికగా అందుబాటులో ఉండబోతుందని ఎక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ ప్రకటించింది. మరో మూడ్రోజుల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

అసరే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో.. ఓ మర్డర్ మిస్టరీని చేధిస్తూ కథ సాగుతుంది. అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ తో సాగే ఈ కథను మే 10వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వాళ్లు మాత్రం ఈ వెబ్ సిరీస్ ను అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











