OTT: ఓటీటీలోకి వచ్చిన కీరవాణి కొడుకు కొత్త సినిమా... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యే సినిమాలు చేస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం భాగ్ సాలే. జూలై 7న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి...:ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణికి ఇద్దరు కుమారులు అన్న సంగతి తెలిసిందే. ఇక పెద్ద కుమారుడు కాలభైరవ.. మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక చిన్న కుమారుడు శ్రీ సింహా.. సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలనటుడిగా.. రాజమౌళి యమదొంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహ. ఆ తర్వాత మర్యాద రామన్న, ఈగ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.
ఫస్ట్ సినిమా సక్సెస్..:ఇక శ్రీ సింహ మత్తు వదలరా అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా తెల్లవారితే గురువారం అనే ఓటీటీ సినిమా చేశాడు. ఇక ఆ తర్వాత దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమా చేశాడు. అయితే ఈ కుర్ర హీరోకు సరైన హిట్టు పడలేదు.

నెలకాకముందే..: ఇక ఈ ఏడాది భాగ్ సాలే అంటూ జూలై 7న థియేటర్లలోకి వచ్చేశాడు. దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మండపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నేహా సోలంకి శ్రీ సింహకు జోడీగా నటించింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక నెలరోజులు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో భాగ్ సాలే మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరరాజన్, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలి మూవీస్ తో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ చిత్రాన్ని నిర్మించింది. కాలభైరవ సంగీతం అందించారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. గతంలో సూర్యకాంతం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
భాగ్ సాలే క్రైమ్ కామెడీగా తెరకెక్కినప్పటికీ.. ఎందుకో ప్రేక్షకులకు ఎక్కలేదనే చెప్పాలి. సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓర్ ఇవ్వడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడలేదు. దీంతో వెంటనే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు థియేటర్లలో ఈ మూవీ మిస్ అయితే గనుక కచ్చితంగా ఓటీటీలో చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











