సైలెంటుగా OTTలోకి వచ్చిన కీరవాణి కొడుకు సినిమా... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిపోయారు. వారం వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇంట్లోనే కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వారం ఓ సినిమా సైలెంటుగా ఓటీటీలో ప్రత్యక్ష్యమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ నటించిన ఉస్తాద్ సినిమా ఓటీటీలోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రిమింగ్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే....

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అసలు కీరవాణికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కాలభైరవ... మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. మరో కొడుకు శ్రీ సింహా.. సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలనటుడిగా.. రాజమౌళి యమదొంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహ... ఆ తర్వాత మర్యాద రామన్న, ఈగ సినిమాల్లో కూడా నటించాడు.

Music Director MM Keeravani son Sri Simha Ustaad Movie Streaming Now on OTT flatform Amazon Prime Video

ఇక శ్రీ సింహ మత్తు వదలరా అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కుర్ర హీరో... వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక ఇటీవల ఉస్తాద్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో.

శ్రీసింహ నటించిన ఉస్తాద్ సినిమా ఆగస్టు 12న థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నేచురల్ నాని కూడా చీఫ్ గెస్టులుగా వచ్చి ప్రమోట్ చేశారు. కానీ ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. మసూద, బలగం సినిమాలతో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్‌ ఈ మూవీలో హీరోయిన్‌ గా నటించింది.

Music Director MM Keeravani son Sri Simha Ustaad Movie Streaming Now on OTT flatform Amazon Prime Video

ఇక ఉస్తాద్‌ చిత్రంలో పాపులర్ డైరెక్టర్ కమ్‌ యాక్టర్ గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ కీలక పాత్రలో నటించారు. అకీరా బీ సంగీతం అందించగా.... శ్రీ సింహా ఈ సినిమాతోనే బ్రేక్‌ అందుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఆశించినస్థాయి హిట్ పడలేదు.

ఇక ఈ మూవీ సైలెంటుగా తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఓ సాధారణ యువకుడు.. పైలట్ ఎలా అయ్యాడు? మధ్య ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. స్టోరీ బాగానే ఉన్నా.. కథలో కాస్త ల్యాగ్ ఉండటం వల్ల థియేటర్లలో సరిగా ఆడలేదు. ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X