అన్ని మంచిగా కనిపిస్తాయి అంటూ సింగర్ గీత మాధురి.. నిన్ను అలా చూస్తే తప్పు అని థమన్ కౌంటర్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ లోనే కాదు నార్మల్ లైఫ్ లో కూడా చాలా సరదాగా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇంటర్వ్యూలలో థమన్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఒక స్టేజి పైన కూడా థమన్ సింగర్ గీత మాధురిపై వేసిన పంచ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఆమె చేసిన కామెంట్ కు థమన్ ఇచ్చిన బోల్డ్ కౌంటర్ మామూలుగా లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంటర్టైన్మెంట్ షోలతో
తమన్ కేవలం సినిమాలతోనే కాకుండా ఇటీవల కాలంలో అయితే వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ షోలతో కూడా చాలా బిజీగా మారిపోతున్నాడు. ఒకవైపు మ్యూజిక్ డైరెక్షన్ మరోవైపు క్రికెట్ కూడా ఆడుతూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇండియన్ ఐడల్ తెలుగు షో లో కూడా ఒక జడ్జిగా కొనసాగిన విషయం తెలిసిందే.

తెలుగు ఇండియన్ ఐడల్
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు రెండో సీజన్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈసారి చాలామంది ప్రముఖ సింగర్స్ కూడా ఈ షోను ప్రత్యేకంగా హోస్ట్ చేయబోతున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా వివిధ రకాల స్టేజ్ షోలతో కూడా ఈ సింగింగ్ షో కు మరింత క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

స్టేజ్ పైన సంభాషణ
ఇక స్టేజ్ షోలపైన పాటలతోనే కాకుండా సరదా కామెంట్లతో కూడా సింగర్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక లైవ్ ఈవెంట్ లో గీత మాధురి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కొనసాగిన సంభాషణ కూడా వైరల్ అయింది. ముఖ్యంగా ఆ స్టేజ్ షో పైన గీత మాధురి తన పాటలతో ఎంతగానో ఆకట్టుకుంది. మంచి మెలోడీ సాంగ్స్ తో పాటు మాస్ సాంగ్స్ తో కూడా ఆమె మెప్పించే ప్రయత్నం చేసింది.

మధ్యలో యాంకర్ మంజూష
గీతా మాధురి పాట పాడిన తర్వాత ఆమె తన మాటలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే యాంకర్ గా ఉన్న మంజూష గీత మాధురి పాడిన విధానాన్ని పొగుడుతూ.. మరోవైపు థమన్ గారు చెప్పినట్లు.. మీ ప్రేజెన్స్ చాలు ఆడియెన్స్ అతుక్కుపోతారు స్క్రీన్ కు.. అని వివరణ ఇచ్చింది. అయితే ఈ విషయంలో గీతా మాధురి కూడా అదంతా ఆయన గొప్పతనం అన్నట్లు వివరణ ఇచ్చింది.

అన్ని మంచిగా కనిపిస్తాయి
చూసే కళ్ళు మంచివైతే అన్ని మంచిగా కనిపిస్తాయి అని గీత మాధురి వివరణ ఇచ్చింది. థమన్ గారు మంచివారు కాబట్టి ఆయన అన్ని మంచి మాటలు చెప్పారు. అలాగే ఆయన చాలా కైండ్ పర్సన్ కాబట్టి అని గీత మాధురి వివరణ ఇస్తూ ఒక్కసారిగా థమన్ ను చూస్తూ ఆగిపోయింది. సార్ ఏంటి సార్ మీరు నేను ఏదో చెప్తుంటే మీరు అటెటో చూస్తున్నారు.. అని గీతమధురి నవ్వుతూ అడిగింది.
నిన్ను చూస్తుంటే తప్పుగా అనుకుంటారు
ఇక థమన్ వెంటనే సమాధానం ఇస్తూ.. కెమెరానే కదా చూడాలి. నిన్ను చూస్తుంటే తప్పుగా అనుకుంటారు కదా అని.. థమన్ వేసిన పంచ్ కు అందరూ అవాక్కయ్యారు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థమన్ లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ డోస్ మాములుగా లేదని మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











