Daaku Maharaaj OTT : మీ ఇంట్లో బాక్స్‌లు జాగ్రత్త .. బాలయ్య మూవీపై థమన్ బ్లాస్టింగ్ పోస్ట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలయ్యకు వరుసగా నాలుగో విజయాన్ని అందించింది డాకు మహారాజ్. విడుదలై దాదాపు రెండు వారాలకు పైనే గడుస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇక ఈ సినిమాపై భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.
అలాగే ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ , విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సహా పలు డబ్బింగ్ చిత్రాలు పోటీకి వచ్చినా బాలయ్య ఎదురొడ్డి నిలిచారు. అంతేకాదు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా బాలకృష్ణ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ ఆయనకు వరుసగా నాలుగో రూ. 100 కోట్ల చిత్రంగా నిలిచింది. మొత్తంగా రూ.540 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సీనియర్ హీరోలలో ఎవరికీ లేని రికార్డును సాధించాడు బాలయ్య.
ఇదిలా ఉండగా .. సినిమా రిలీజ్ అయి గంటలు గడవక ముందే డాకు మహారాజ్‌ను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.50 కోట్లకు పైగా వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఫిబ్రవరి రెండో వారం తర్వాత డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా డాకు మహారాజ్ ఓటీటీపై ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లయ్ ఇస్తూ.. త్వరలోనే డాకు మహారాజ్‌ను ఓటీటీలో చూడబోతున్నామని, అలాగే ఈ చిత్రం డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుపుతూ డ్రమ్స్ సింబల్స్‌ను షేర్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఆడియన్స్ మీ ఇళ్లలో సౌండ్ బాక్స్‌లు జాగ్రత్త అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











