OTTలోకి రీసెంట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. ఎందులో చూడాలంటే?
ఓటీటీ లవర్స్ కోసం.. ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ తీసుకువస్తున్నాయి. అటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను కూడా నెలలోపే రిలీజ్ చేస్తూ.. ఓటీటీ లవర్స్ కోసం తీసుకువస్తున్నారు. ఇక తాజాగా ఓటీటీలోకి మరో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రాబోతుంది. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 800 మూవీ. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథేంటి.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంది.. ఏ ఓటీటీలో రాబోతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవల బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు, రాజకీయ ప్రముఖులే కాదు.. క్రికెటర్స్ జీవితం ఆధారంగా కూడా బయోపిక్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే స్పోర్ట్స్ డ్రామాలు చాలా వచ్చాయి. ఎంఎస్ ధోనీ, సచిన్ టెండుల్కర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం ఆధారంగా 800 మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ నిలించారు. అలాంటి ఆయన జీవిత కథను ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై 800 సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. 2022లో బుకర్ ప్రైజ్ కైవసం చేసుకున్న షెహాన్ కరుణతిలకతో కలిసి శ్రీపతి స్క్రిప్ట్ రాశారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ ఏడాది అక్టోబర్ 6న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా రిలీజ్ అయింది.
దానితో పాటు ఈ సినిమా శ్రీలంకలో సింహళ భాషలో కూడా రిలీజ్ అయింది. ఇందులో ముత్తయ్య మురళీధర్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ అద్భుతంగా నటించారు. అతని భార్య పాత్రలో మహిమా నంబియార్ నటించగా... ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక 800 మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఓటీటీ వేదికపై అలరించేందుకు ఈ సినిమా రెడీ అయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఓ ట్వీట్ చేసింది. ఇక థియేటర్లో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాలో 800 వికెట్స్ అంశాలే కాకుండా ముత్తయ్య మురళీధర్ జీవితంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలను చూపించారు. అంతే కాదు... తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, ఎదురైన అవమానాలు వంటివి స్క్రీన్ పై చూపించారు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మీరు ఈ సినిమాను థియేటర్లో మిస్ అయితే కనుక జియో సినిమాలో ఇంట్లోనే చూసేయండి.


Click it and Unblock the Notifications











