OTTలోకి వచ్చేసిన స్పిన్ మాంత్రికుడి బయోపిక్... ఎందులో చూడాలంటే?
ఓటీటీలో కొత్త సినిమాలు రావడం సహజం. కానీ చడి చప్పుడు లేకుండా ఏవైనా సర్ ప్రైజ్ ఇస్తే.. ఆడియెన్స్ కు సూపర్ థ్రిల్ కలుగుతుంది. అలా ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో సందడి చేస్తుందిత. లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారం రూపొందిన చిత్రం 800. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింధీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఈ సినిమాను ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేశారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి శ్రీపతి స్క్రిప్ట్ రచించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో ఈ సినిమా రిలీజ్ అయింది.

ముత్తయ్య మురళిధరణ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ 800 సినిమా అక్టోబర్ 6న పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లలోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలే కాకుండా సింహళ భాషలోనూ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎందుకో కానీ స్పోర్ట్ ఎమోషనల్ డ్రామా మనవాళ్లకు కనెక్ట్ కాలేదు. అయినప్పటికీ సినిమాకి మంచి టాక్ వచ్చింది.
అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. '800' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'జియో సినిమా' భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 800 స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు సింహాళ భాషలోనూ అందుబాటులో ఉంది.
800 చిత్రం థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే... ఆశించిన రీతిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ వస్తుందని తెలుస్తోంది.

'800' సినిమాలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించాడు.,మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించగా... 'అఖండ', 'స్కంద' సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర పోషించారు. ఇది కేవలం క్రికెటర్ బయోపిక్ అని కాకుండా.. అంతకు మంచిన వ్యక్తిగత విషయాలు ఇందులో చూపించారు. ఇక ఈ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే జియో సినిమాలో ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా చూసేయండి.


Click it and Unblock the Notifications











