OTT ఆడియెన్స్ బీ అలర్ట్ - అసలైన దొంగ మీ ఇంట్లోకి చొరబడేది ఆ రోజే!

టైటిల్​ చూసి ఇంటికి అసలైన దొంగ రావడం ఏంటని ఆలోచించారా? మ్యాటర్ ఏంటంటే మూవీ లవర్స్​కు ఓటీటీ సంస్థలు వరుసగా సినిమాలు వదులుతూ ఫుల్ ఎంటర్​టైన్ చేస్తున్నాయి కదా. అలా ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్​కు సిద్ధమైంది. దాని గురించే ఈ కథనం. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్ అభిన‌వ్ గోమటం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన హీరోగా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం మై డియ‌ర్ దొంగ. ఇది డైరెక్ట్ రిలీజ్​కు రెడీ అయింది. ఈ చిత్రంలో అభిన‌వ్ గోమ‌టంతో పాటు శాలిని కొండెపూడి కూడా నటించింది. ఈ చిత్రం పేరే మై డియర్ దొంద. అదేంటి అడ‌వి దొంగ విన్నాం. ట‌క్క‌రి దొంగ, జేబు దొంగ విన్నాం. కానీ మై డియ‌ర్ దొంగ ఎంటని అనుకుంటున్నారా? మరి ఇది ఎవ‌రో తెలియాలంటే అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా విడుదల చేయనున్న ఈ సినిమా చూడాల్సిందే.

My dear Donga Movies Streaming on aha ott From april 19th full Details Here

తాాజాగా ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అఫీషియల్ అనౌన్స్​ మెంట్ చేసింది మూవీటీమ్. ఏప్రిల్ 19న ఇది స్ట్రీమింగ్​కు అందుబాటులో రానున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి. ఎందుకంటే అసలైన దొంగ April 19thన వస్తున్నాడు! అంటూ రాసుకొచ్చింది. అలాగే ఓ పోస్టర్​ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కారులో అభినవ్ గోమటంతో పాటు ఇతర నటీనటులు ఉన్నారు. ఇది చూస్తుంటే వాళ్లని ఎవరో వెంబడిస్తున్నట్లుగా, వారు కారులో తప్పించుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. ఈ చిత్రం ఫుల్ హిలేరియస్​గా సాగుతుందని మూవీటీమ్ చెబుతోంది.

ఇకపోతే ఈ మై డియ‌ర్ దొంగ చిత్రాన్ని స‌ర్వ‌జ్ఞ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మించారు.ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తూనే సినిమాకు రైట‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రించింది శాలిని కొండెపూడి. అజ‌య్ అర‌సాడా సంగీతం సమకూర్చారు. ఆహానే తమ ఒరిజినల్​ మూవీగా దీన్ని రూపొందించిందని కూడా అంటున్నారు.

My dear Donga Movies Streaming on aha ott From april 19th full Details Here

కాగా, మ‌ళ్లీరావా చిత్రంతో అభిన‌వ్ గోమటం తెలుగు చిత్ర సీమలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్ర‌లో కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించాడు. ఆ తర్వాత మీకు మాత్ర‌మే చెప్తా, శ్యామ్ సింగ‌రాయ్‌, విరూపాక్ష సహా ప‌లు చిత్రాల్లో నటించాడు. సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే చూసీ చూడంగానే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది శాలిని కొండెపూడి. జ‌య‌మ్మ పంచాయ‌తీలోనూ న‌టించింది. అల్లుడు గారు అనే వెబ్‌సిరీస్‌లోనూ న‌టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X