నెట్‌ఫ్లిక్స్‌లో లిమ్ జీ-యోన్ కొత్త మ్యాజిక్.. ఈ కే-డ్రామా కోసం ఫ్యాన్స్ ఎందుకు వెయిటింగ్?

ప్రపంచవ్యాప్తంగా కొరియన్ డ్రామాలకు ఉన్న ఆదరణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో ఈ కొరియన్ సినిమాలకు సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి వారి కోసం నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. మే 8 నుంచి మై రాయల్ నెమెసిన్ మూవీని స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఎస్ నిర్మించిన ఈ ఫన్నీ డ్రామాలో స్టార్ హీరోయిన్ లిమ్ జీయోన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

స్టూడియో ఎస్, స్టూడియో డ్రాగన్, గిల్ పిక్చర్స్ ఈ మై రాయల్ నెమిసెస్ డ్రామాను నిర్మించాయి. కిమ్ మిన్ టౌ నిర్మాతగా వ్యవహరించారు. రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ డ్రామాకు హన్ టౌ సీయోప్ దర్శకత్వం వహించగా.. కాంగ్ హ్యూన్ జూ రచనా సహకారం అందించారు. లిమ్ జి యోన్, హియో నామ్ జూన్, జంగ్ సియాంగ్ జో, కిమ్ మిన్ సియాక్, లీ సి హి, కిమ్ హై సూక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

My Royal Nemesis Netflix Release Lim Ji-yeon s New K-Drama Streaming Details for Indian Fans in 2026

పాత తరానికి చెందిన కథలను.. జెన్- జీ ట్రెండ్‌కు తగినట్లుగా డిజైన్ చేశారు మేకర్స్. కొరియాకు చెందిన రాజ కుటుంబాలు, రహస్య ప్రేమకథల చుట్టూ ఈ మై రాయల్ నెమెసిస్ తిరుగుతుంది. ఈ డ్రామాను లిమ్ జీ యోన్ తన భుజాలపై మోసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. బాధ్యతకు, మనసుకు మధ్యలో నలిగిపోయే ఓ యువతిగా లిమ్ జీయోన్ ఒదిగిపోయారు. ఆమెలోని కామెడీ టచ్‌ను ఈసారి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. కొరియోలో స్టార్‌గా ఉన్న లిమ్.. ఈ డ్రామాతో ఇండియాలోనూ తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటారని అంటున్నారు.

మై రాయల్ నెమిసిస్ డ్రామాని ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఎస్‌బీఎస్ టీవీలో ప్రీమియర్స్‌గా ప్రదర్శించాలని నిర్ణయించారు. శుక్ర, శనివారాలలో ఈ డ్రామాను టెలికాస్ట్ చేయనున్నారు. 2025 ఎస్‌బీఎస్ డ్రామా అవార్డ్స్ సెర్మనీలో మై రాయల్ నెమిసిస్ సిరీస్ టీజర్‌ను ప్రదర్శించారు. మే 8 నుంచి ఈ రొమాంటిక్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుందని ఓటీటీ దిగ్గజం ప్రకటించింది. మరి ఈ కొరియన్ డ్రామాకు భారత్‌లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

భారతీయ ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ కూడా వరుసగా కొరియన్ షోలను యాడ్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ చేస్తోంది. ముఖ్యంగా లైట్ హార్టెడ్ రామ్‌కామ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో మై రాయల్ నెమెసిస్' కూడా త్వరలోనే టాప్ 10 లిస్టులోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. దీనికి తగినట్లుగానే నెట్‌ఫ్లిక్స్ కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Read more about: netflix india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X