OTT లోకి మైత్రీ మూవీ మేకర్స్.. పుష్ప యాక్టర్‌తో కామెడీ సినిమా
తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతున్న సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. మరో విభిన్నమైన నిర్ణయంతో ప్రేక్షకులకు చేరవయ్యేందుకు సిద్దమయ్యారు. 2023 సంవత్సరం ఆరంభంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకొన్న నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవి ప్రకాశ్.. అమిగోస్ సినిమాతో హ్యాట్రిక్ అందుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే వారు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
తెలుగు వినోద పరిశ్రమలో ఆహా ఓటీటీ విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్నది. తెలుగు సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్, వెబ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. కేవలం సినిమాలే కాకుండా అన్ స్టాపబుల్, కామెడీ తరహా టాక్ షోలు, వినోద కార్యక్రమాలతో ఆహా తన మార్క్‌ను చాటుకొన్నది. ఇలా దూసుకుపోతున్న ఆహా, మైత్రీ మూవీ మేకర్స్ చేతులు కలపడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పుష్ప సినిమాతో కమెడియన్‌గా ఆకట్టుకొన్న జగదీష్ బండారీ ప్రధాన పాత్రలో సత్తిగాని రెండు ఎకరాలు.. ఉప శీర్షిక అమ్ముతాడా? సస్తాడా? ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురగ, రాజ్ తిరందాసు, అనీషా దామా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నది.


Click it and Unblock the Notifications











