OTTలోకి నా సామి రంగ సినిమా... ప్రేక్షకులకు కింగ్ నాగార్జున స్వీట్ మెసెజ్!
ఈ వీకెండ్ మిమ్మల్ని ఇంటికొచ్చి మరీ అలరించేందుకు కింగ్ నాగార్జున సిద్ధమైపోయారు. ఆయన నటించిన సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నా సామిరంగ సినిమాతో ఓటీటీ వేదికగా సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రేక్షకులకు మన్మథుడు నాగ్ ఓ స్వీట్ వీడియో మెసేజ్‌ను పంపించారు. అందులో ఆయన ఏం చెప్పారు? సినిమా ఏ తేదీన స్ట్రీమింగ్కు అందుబాటలో రానుంది? వంటి విషయాలను తెలుసుకుందాం..
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఆరు పదుల వయసులోనూ ఇంకా గ్లామర్‌గా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ మనసులను దోచేసుకున్నారు. ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ వారిని అలరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో కొత్త కథలతో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. కానీ ఆ మధ్య ఆయనకు తన స్టార్ డమ్‌కు తగ్గట్టు సరైన హిట్ పడలేదు. వరుసగా ఆయన నటించిన సినిమాలను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి

సంక్రాంతి పండగ బరిలో నా సామి రంగ: చివరిగా బంగార్రాజు సినిమాతో సంక్రాంతి బరిలో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత ఇతర సినిమాలు చేసినా ఆడలేదు. దీంతో చాలా కాస్త గ్యాప్ తీసుకుని ఆచితూచి మరి నా సామి రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేవలం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి తనకు అచ్చొచ్చిన సంక్రాంతి పండగ బరిలోనే దిగారు.

ఇప్పుడు ఓటీటీలోకి నా సామి రంగ: బడా సినిమాలు ఉన్నా ఆ పోటిని తట్టుకుని మరీ తన చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టే థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుని మంచి వసూళ్లను సాధించింది. దీంతో నాగ్‌కు మళ్లీ చాలా కాలం తర్వాత భారీ హిట్ దక్కింది. అయితే సంక్రాంతి సినిమాలు విడుదలై నెల రోజులు అయిన సందర్భంగా ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఇప్పటికే సైంధవ్, గుంటూరు కారం రిలీజ్ అవ్వగా ఇప్పుడు నా సామి రంగ కూడా వచ్చేస్తుంది.
నాగార్జున వీడియో మెసేజ్: ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 17న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇప్పుడీ రిలీజ్ డేట్ ఒక్క రోజే ఉందనగా నాగార్జున మరోసారి తన సినిమా రాబోతున్నట్లు వీడియో మెసేజ్ ద్వారా గుర్తుచేశారు. ఫిబ్రవరి 17న నుంచి ఉంటది పండగ.. నా సామి రంగ.. సినిమా ఎలా ఉందో చెప్పండి. డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో చూడండి అంటూ అదిరిపోయే రేంజ్లో మాస్ అవతార్‌లో స్టైలిష్‌గా కనిపించి చెప్పారు.

రీమేక్ మూవీగా వచ్చి సూపర్ హిట్టుగా: మలయాళ మూవీ పరింజు మరియం జోస్‍కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నెటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి సినిమాను రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్, అల్లరి నరేశ్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్‍కు జోడీగా రుక్సార్ థిల్లాన్ నటించారు. నాజర్, రవివర్మ, షబ్బీర్ కల్లరకల్, మధుసూదన్ రావు, రావు రమేశ్ ఇతర పాత్రల్లో నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ మాటలను అందించారు.


Click it and Unblock the Notifications











