ఓటీటీలోకి తెలుగు అపరిచితురాలు.. నవ్వించి చంపేసే దీన్ని ఎక్కడ చూడాలో తెలుసా?

సినిమాల పరంగా మూవీ లవర్స్‌కు ఒకప్పుడు ఉన్న అభిరుచులు ఇప్పుడు లేవు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు రూపొందుతోన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్టులతో కొత్త చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'డార్లింగ్' (Darling).

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ నభా నటేష్, టాలెంటెడ్ గాయ్ ప్రియదర్శీ జంటగా నటించిన సినిమానే 'డార్లింగ్'. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిని పెళ్లాడిన యువకుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అనే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాలు జూలై 19వ తేదీన విడుదలైంది.

Nabha Natesh Starrer Darling Movie OTT Streaming From August 13th

థ్రిల్‌కు గురి చేస్తూ నవ్విస్తూ సాగిపోయే కథతో రూపొందిన 'డార్లింగ్' సినిమా మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీకి మొదటి రోజే ఆశించిన టాక్ రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్‌ను అందుకోలేదు. అలా ఫుల్ రన్‌లోనూ థియేటర్లలో మంచి ప్రదర్శన చేయలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పాలైంది.

విడుదలకు ముందే మంచి బజ్‌ను ఏర్పరచుకున్న 'డార్లింగ్' సినిమాకు సంబంధించిన అన్ని హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ కోసం చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ 'డార్లింగ్' మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక, తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన చేసింది.

Nabha Natesh Starrer Darling Movie OTT Streaming From August 13th

నభా నటేష్, ప్రియదర్శి నటించిన 'డార్లింగ్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 13వ తేదీ నుంచే సదరు సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. ఇందుకోసం ఓ పోస్టర్‌ను సైతం హాట్‌స్టార్ సంస్థ విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'డార్లింగ్' సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. ఇందులో అనన్య నాగళ్ల, బ్రహ్మానందం, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను చేశారు.

More from Filmibeat

Read more about: darling darling ott nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X