పెళ్లాం అపరిచితురాలుగా మారితే.. ఓటీటీలోకి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ

ఒకప్పుడు దర్శక నిర్మాతలు ప్రయోగాలు చేయాలంటే చాలా ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీంతో గతంలో కంటే భిన్నమైన సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమాకు ప్రేక్షకుల స్పందన కూడా భారీ స్థాయిలోనే లభిస్తోంది. దీంతో మరిన్ని చిత్రాలు వస్తున్నాయి. ఇలా ఇటీవలే వచ్చిన సినిమానే 'డార్లింగ్'.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్, విలక్షణ నటుడు ప్రియదర్శీ జంటగా నటించిన చిత్రమే 'డార్లింగ్'. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిని పెళ్లాడిన యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా తేరుకున్నాడు? అనే ప్రధానాంశాలతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలు జూలై 19వ తేదీన రిలీజ్ అయింది.

Nabha Natesh Starrer Darling Movie OTT Streaming Started On Hotstar

నవ్విస్తూ థ్రిల్‌కు గురి చేసే కథాంశంతో తెరకెక్కిన 'డార్లింగ్' సినిమా మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ, ఈ మూవీకి మొదటి రోజే ఆశించిన టాక్ రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సరైన స్పందనను తెచ్చుకోలేదు. అలా ఫుల్ రన్‌లోనూ థియేటర్లలో మంచి ప్రదర్శన చేయలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద నభా నటేష్ మూవీ సక్సెస్‌ను అందుకోలేదు.

ప్రచార చిత్రాలతోనే హైప్ క్రియేట్ చేసుకున్న 'డార్లింగ్' సినిమాకు సంబంధించిన అన్ని హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ కోసం చాలా సంస్థలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ 'డార్లింగ్' మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక, తాజాగా ఈ సినిమాను ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Nabha Natesh Starrer Darling Movie OTT Streaming Started On Hotstar

నభా నటేష్, ప్రియదర్శి జంటగా నటించిన 'డార్లింగ్' సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ గత అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. ఇందులో థియేటర్ల కంటే కొంత ఎక్కువ కంటెంట్‌ను జోడించి తీసుకు వచ్చినట్లు తెలిసింది. అయితే, థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం మంచి స్పందనను అందుకుంటున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'డార్లింగ్' సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. ఇందులో అనన్య నాగళ్ల, బ్రహ్మానందం, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Read more about: darling darling ott nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X