Nandamuri Balakrishna: దాన్ని వదిలేసి దీన్ని పట్టుకో బ్రో.. ఆ పని బాగా చేస్తావ్.. డైరెక్టర్‌కు బాలకృష్ణ సూచన!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగా మాస్ పర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా తనలోని యాంకరింగ్ టాలెంట్ ను కూడా బయటపెట్టాడు బాలయ్య బాబు. ఈ షో ద్వారా తాను అడగాలనుకున్న సూటి ప్రశ్నలను అడిగేస్తూనే.. మవరోవైపు ఫుల్ కామెడీ చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులను కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవలే మూడో సీజన్ లోకి కూడా అడుగు పెట్టింది.
ఈక్రమంలోనే యానిమల్ చిత్ర బృందం 'Unstoppable with NBK' మూడో సీజన్‌లో భాగంగా షోలో 2వ ఎపిసోడ్ లో పాల్గొనేందుకు వచ్చింది. ఇటీవలే విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ లు ఈలో సందడి చేశారు. ముందుగా యానిమల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాను.. ఆ తర్వాత హీరో రణ్‌బీర్ కపూర్‌ను.. చివరగా హీరోయిన్ రష్మికను తనదైన స్టైల్ లో ఆహ్వానించారు.

ముందుగా వచ్చిన సందీప్ రెడ్డి వంగాతో చాలా కామెడీ చేశారు హీరో బాలకృష్ణ. పని లేనప్పుడు మామూలు సమయాల్లో ఏం చేస్తావ్.. ఏం తాగుతుంటావ్ అని అడగ్గా.. సందీప్ రెడ్డి వంగా తెగ సిగ్గు పడిపోయాడు. ఫుల్లుగా నవ్వుతూనే ఎప్పుడైనా ఓసారి విక్సీ తాగుతుంటాను సార్ అని చెప్పాడు. దీనికి స్పందించిన బాలయ్య బాబు.. అది మానేసి చక్కగా నా బ్రాండీకి వచ్చెయ్ అని. అప్పుడే స్క్రిప్టు త్వరగా రాస్తావ్ అంటూ చెప్పుకొచ్చాడు.బాలకృష్ణ అలా చెప్పగానే డైరెక్టర్ పడీ పడీ నవ్వుకున్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈక్రమంలోనే చాలా మంది నెటిజెన్లు.. బాలకృష్ణ వాడే బ్రాండీ ఏంటని... అడుగుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ బ్రాండ్ ఏంటనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. మాన్షన్ హౌస్ అనే బ్రాండీని బాలయ్య బాబు ఎక్కువగా తాగుతుంటారు. ఈ వీడియో కింద కూడా చాలా మంది బాలయ్య బాబు బ్రాండ్ ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు. అంతే కాదండోయ్.. మాన్షన్ హౌస్ తాగితే స్క్రిప్టు త్వరగా రాసేయొచ్చట అంటూ కూడా ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు.
రష్మిక మందన్నా, రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాలు కలిసి వచ్చిన ఈ షోకు నవంబర్ 24వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే విడుదల అయిన ప్రోమోకు విపరీతమైన స్పందన రాగా.. పూర్తి ఎపిసోడ్ ను చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











