ఓటీటీలోకి నాగచైతన్య - శోభితా పెళ్లి వీడియో.. ఎన్నికోట్లకు అమ్ముడైందో తెలుసా?
అక్కినేని నాగచైతన్య -శోభితా ధూళిపాళ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైతూ సమంతతో చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాత.. కొద్ది నెలలకే శోభితాతో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అటు శోభితా ధూళిపాళ కూడా చైతూ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ఒకరినొకరు ఇష్టపడ్డారు.
వీరి పరిచయం సాధారణ ప్రేమికుల మాదిరగానే జరిగిందని రీసెంట్ గానే నాగచైతన్య చెప్పిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వారి పరిచయం ప్రేమగా మారి.. ఆ ప్రేమ మూడుముళ్ల బంధం వరకు తీసుకొచ్చిందని చెప్పారు. శోభితా ధూళిపాళతో నాగచైతన్య అక్కినేని రెండేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు. తరుచూ లండన్ వీధుల్లో ఈ జంటలు కనిపిస్తూ ఉండేవారు. అప్పటికే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే కథనాలు కోకొల్లలుగా వస్తూనే ఉండేవి.

ఇక ఎట్టకేళలకు చైతూ- శోభితా తమ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి 2024 ఆగస్టు 8న గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకు 2024 డిసెంబర్ 4న నాగచైతన్య - శోభితాల పెళ్లి వేడుకు అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహా వేడుకకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. బంధుమిత్రులు కూడా ఈ జంటకు తమ మద్దతు తెలిపారు. రెండో భాగమైనా నాగచైతన్య జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.
అయితే.. ఇటీవల కాలంలో సినీ తారల పెళ్లి వేడుకను చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతలా ఊవ్విళ్లూరుతున్నారో తెలిసిందే. సినిమాలే కాకుండా.. స్టార్స్ వెడ్డింగ్ ను కూడా డాక్యుమెంటరీ రూపంలో పలు ఓటీటీ సంస్థలు ఫ్యాన్స్, ఆడియెన్స్ కు అందుబాటులో ఉంచుతున్నారు. సాధారణంగానే తారల వివాహా వేడుక చూడాలని ఎవరైనా ఆసక్తి ఉంటుంది. కానీ డైరెక్ట్ ఇన్విటేషన్ అందరికీ సాధ్యం కాదనేది తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సెలబ్రెటీల వెడ్డింగ్ డాక్యుమెంటరీలను కొనుగులు చేసి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది నయనతారా- విఘ్నేష్ ల పెళ్లి వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసి విషయం తెలిసిందే. ఇక నాగచైతన్య - శోభితా ధూళిపాళ వెడ్డింగ్ డాక్యుమెంటరీని కూడా అదే సంస్థ కొనుగోలు చేసిందని తెలిసిందే. వారి పెళ్లి వీడియోపై హక్కులను ఆ సంస్థ దక్కించుకుంది. అయితే భారీ మొత్తం చెల్లించి నాగచైతన్య -శోభితాల పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ కొనుగులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఏకంగా రూ.50 కోట్లు ఇచ్చి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్. మీడియం బడ్జెట్ సినిమాలు, అది హిట్ అయితే ఆ రేంజ్ లో డబ్బు వెచ్చించి ఓటీటీ సంస్థలు రైట్స్ ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా యాబై కోట్లతో చైతూ, శోభితాల వెడ్డింగ్ డాక్యుమెంటరీని భారీ మొత్తంతో కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుంది. డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక చైతూ 'తండేల్'తో రూ.100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











