Custody OTT: అప్పుడే ఓటీటీలో నాగ చైతన్య కస్టడీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?
అక్కినేని నాగార్జున కుమారుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనదైన నటనతో ముందుగు సాగుతున్నాడు. జోష్ మూవీతో హీరోగా పరిచయం అయిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. అయితే గత కొంతకాలంగా నాగ చైతన్య సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కావట్లేదు. ఈ క్రమంలో ఎలాగైనా మంచి హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ భావించిన సినిమా కస్టడీ. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో కస్టడీ ఓటీటీ విడుదలై ఆసక్తి నెలకొంది.
నాగ చైతన్య తాజాగా ద్విభాష చిత్రంలో నటించిన సినిమా కస్టడీ. టాలీవుడ్, కోలీవుడ్ బైలింగువల్ మూవీగా వచ్చిన కస్టడీ చైతూకి తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా. దీనికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా కృతీ శెట్టి మరోసారి నాగ చైతన్యతో జోడీ కట్టింది. ఈ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అలాగే సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన కస్టడీ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమా మే 12న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తూ యావరేజ్ గా మిగిలింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లుగా సమాచారం. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు.
అయితే తాజాగా కస్టడీ ఓటీటీ రైట్స్ ఆసక్తికరంగా మారాయి. కస్టడీ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మంచి ధర వెచ్చించి సొంతం చేసుకుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం యావరేజ్ టాక్ వస్తున్న ఈ సినిమా స్టామినా ఏంటో ఈ వారం గడిస్తే తెలిసిపోతుంది. దాన్ని బట్టి రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట. ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే.. జూన్ తొలి వారం లేదా రెండో వారంలో కస్టడీని డిజిటల్ తెరపై ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఇటీవల రావణాసుర, దసరా, శాకుంతలం సినిమాలు నెలకంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేశాయి. కాబట్టి కస్టడీ కూడా వీటికి మినహాయింపు కాదని అర్థం చేసుకోవచ్చు. మరి ఓటీటీలో కస్టడీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











