Custody OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగ చైతన్య కస్టడీ.. మారిన డిజిటల్ ప్లాట్ ఫామ్.. ఎందులో అంటే?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనదైన నటనతో ముందుగు సాగుతున్నాడు. జోష్ మూవీతో హీరోగా పరిచయం అయిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. అయితే గత కొంతకాలంగా నాగ చైతన్య సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కావట్లేదు. ఈ క్రమంలో ఎలాగైనా మంచి హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ భావించిన సినిమా కస్టడీ. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అక్కినేని అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది. అది ఎందులో అనే వివరాల్లోకి వెళితే..

మరోసారి జోడీ:అక్కినేని నాగ చైతన్య తాజాగా ద్విభాష చిత్రంలో నటించిన సినిమా కస్టడీ. టాలీవుడ్, కోలీవుడ్ బైలింగువల్ మూవీగా వచ్చిన కస్టడీ చైతూకి తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా. అంతేకాకుండా చైతూ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా కృతీ శెట్టి మరోసారి నాగ చైతన్యతో జోడీ కట్టింది.

Naga Chaitanya Custody Movie OTT Streaming From June 9 In Amazon Prime Video

నటీనటులు:కస్టడీ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన కస్టడీ చిత్రంలో అరవింద్ స్వామి ప్రధాన విలన్ గా కనిపించినట్లు సమాచారం. అలాగే ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.

Naga Chaitanya Custody Movie OTT Streaming From June 9 In Amazon Prime Video

మరోసారి నిరాశ:ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఇద్దరు కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చి యావరేజ్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగా వచ్చాయి. దీంతో నాగ చైతన్యకు మరో ప్లాప్ వచ్చిందని అక్కినేని ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు.

Naga Chaitanya Custody Movie OTT Streaming From June 9 In Amazon Prime Video

నెట్ ఫ్లిక్స్ లో కాకుండా:ఇదిలా ఉంటే థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న చైతూ కస్టడీ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. కస్టడీ ఓటీటీ హక్కులను మంచి ధర వెచ్చించి ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కస్టడీ మూవీ దర్శనం ఇచ్చింది.

కొన్ని రోజుల ముందే:అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ కు రావడానికి కారణాలు తెలియరాలేదు. కానీ జూన్ 9 నుంచి అంటే ఇవాళ్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా కస్టడీ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా చేసింది. మే 12న రిలీజైన కస్టడీ నెలకు కొన్ని రోజుల ముందే ఓటీటీలో ప్రదర్శితం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X