Dhootha: నాగ చైతన్య వెబ్ సిరీస్‌పై లేటేస్ట్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పండగే
అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. 'జోష్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌కు దక్కించుకున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని చైతూ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఆ మధ్య కొన్ని ఫ్లాపులు పలకరించినా.. 'మజిలీ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి అక్కడి నుంచి దూసుకుపోతోన్నాడు.
ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న నాగ చైతన్య.. గత ఏడాది 'లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ యంగ్ హీరో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ సంక్రాంతికి 'బంగార్రాజు'గానూ వచ్చి మెప్పించాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

వీటితో పాటు అక్కినేని నాగ చైతన్య 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఈ యంగ్ హీరో.. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.
ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ధూత' వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. ఇక, తాజాగా దీన్ని స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్‌ను వచ్చే ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే అమెజాన్ సంస్థ వదలబోతుందని కూడా తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ధూత' వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు. హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియ భవానీ శంకర్ నటిస్తోందని తెలుస్తోంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











