Dhootha: అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. మరో భాషలోకి నాగ చైతన్య

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అలా వచ్చి టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోలు మాత్రం కొంత మందే ఉన్నారు. అందులో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. 'జోష్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. కెరీర్ ఆరంభంలోనే తన టాలెంట్లను చూపించి ప్రత్యేకమైన ఇమేజ్‌కు దక్కించుకున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని చైతూ.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఆ మధ్య కొన్ని ఫ్లాపులు పలకరించినా.. 'మజిలీ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి దూసుకెళ్తున్నాడు.

ఇటీవలి కాలంలో అక్కినేని నాగ చైతన్య వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. గత ఏడాది 'లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు'గానూ వచ్చి మెప్పించాడు. ఈ రెండు చిత్రాలూ విజయాన్ని అందుకోవడంతో అతడి ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను కంప్లీట్ చేసుకున్నాడు. ఈ చిత్రం జూలై 22న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీనితో పాటు చైతూ 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటించిన విషయం తెలిసిందే.

 Naga Chaitanya Dhootha Web Series Streaming on Telugu and Tamil

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనితో అతడు తొలిసారి డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ కూడా పూర్తైంది. ఈ విషయాన్ని ఇటీవలే అమెజాన్ సంస్థ వెల్లడించింది. మిగిలిన భాగాన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసుకుని.. వీలైనంత త్వరగా దీన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు.

ఫేమస్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ధూత' వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను వచ్చే ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే అమెజాన్ సంస్థ వదలబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని కూడా సదరు సంస్థ వచ్చే వారం ప్రకటించబోతుందని తెలిసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ధూత' వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడట. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియ భవానీ శంకర్ నటిస్తోందని తెలుస్తోంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X