నిర్మాతలుగా మారిన స్టార్ హీరోలు.. చైతూ ఓటీటీ ఎంట్రీ.. 'మాయాబజార్' నటీనటులు తెలిస్తే?

జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ ఫలితాలాతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉండే చైతూ గతేడాది థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కస్టడీ సినిమా చేస్తున్నాడు. అయితే ఇదివరకే కె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ అని వార్తలు వచ్చిన దానికంటే ముందుగా మరో సినిమాతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

నిరాశ పరిచిన సినిమా..

నిరాశ పరిచిన సినిమా..

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ చైతన్య. 2009లో జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అక్కినేని యువ హీరో సినీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకున్నా కథ పరంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ మూవీ అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. ఇక ఆ మూవీ తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య.

 అక్కడ ఎంట్రీ ఇద్దామనుకుంటే..

అక్కడ ఎంట్రీ ఇద్దామనుకుంటే..

ఏ మాయ చేశావే సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు నాగ చైతన్య. ఇక ఇటీవల నాగ చైతన్య సినిమాలు అంతగా హిట్ కావట్లేదు. మనం వంటి మంచి ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన థ్యాంక్యూ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న లాల్ సింగ్ చద్ధా కూడా ఫ్లాప్ అయింది. ఈ రెండు ఫ్లాప్ ల తర్వాత ఇప్పుడు తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఓటీటీలోకి ఎంట్రీ..

ఓటీటీలోకి ఎంట్రీ..

కస్డడీ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ఇటీవల విడుదలైన కస్టడీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అలనాటి క్లాసిక్ హిట్..

అలనాటి క్లాసిక్ హిట్..

అయితే ఇదివరకే థ్యాంక్యూ మూవీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మాత్రం మళ్లీ రాలేదు. ఈ క్రమంలో దానికంటే ముందుగా డిజిటల్ తెరపైకి నాగ చైతన్య అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అది హీరోగా కాదు. నిర్మాతగా. అవును.. నాగ చైతన్య నిర్మాతగా మారి నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ మాయాబజార్. సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏయన్నారు అభిమన్యుడిగా, శశిరేఖగా సావిత్రి, ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ నటించి మెప్పించిన అలనాటి క్లాసిక్ హిట్ మూవీ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ రానుంది.

చైతూకి నచ్చడంతో..

చైతూకి నచ్చడంతో..

అయితే మాయబజార్ వెబ్ సిరీస్ కు నాగ చైతన్య మాత్రమే కాకుండా దగ్గుబాటి రానా కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఒక ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశారు. 'స్పిరిట్ మీడియా' నిర్మాణ సంస్థ ద్వారా మాయ బజార్ ను నిర్మిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ లో ప్రకటించిన ఈ సిరీస్ కథ తాజాగా చైతూకి నచ్చడంతో ఇందులో భాగస్వామ్యం అయ్యాడు.

త్వరలో షూటింగ్ పూర్తి..

త్వరలో షూటింగ్ పూర్తి..


గౌతమి చల్లగుళ్ల అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో నరేష్ విజయకృష్ణ, ఝాన్సీ, ఇషా రెబ్బా, అదితి, రవి వర్మ, హరితేజ, నవదీప్, రాజా చెంబోలు, సునయన, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ చేస్తున్న మాయాబజార్ వెబ్ సిరీస్ కు జెర్రీ సిల్వస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X