Thandel OTT Release Date : ఓటీటీలోకి ‘తండేల్’.. రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా అవుతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 'తండేల్' చిత్రం థియేట్రికల్ రన్ లో విజయం సాధించింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఆడియెన్స్ ఈ ప్యూర్ లవ్ అండ్ యాక్షన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వారాలైనా ఇంకా బాక్సాఫీస్ వద్ద 'తండేల్' చిత్రం వసూళ్లు రాబడుతూనే ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ చూసేందుకు ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. మన దగ్గర నుంచి రిపీటెడ్ ఆడియెన్స్ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన చిత్రాల్లో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 'సంక్రాంతి వస్తున్నాం' తర్వాత 'తండేల్' అనే చెప్పాలి. ఇక అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు కూడా సిద్ధమవుతోంది. సాధారణంగా ఏ చిత్రమైన థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఐదు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో అడుగుపెడుతంది.

Naga Chaitanya Sai Pallavi s Thandel Movie OTT Release Date Lock Full Details Here

కానీ తండేల్ మాత్రం కాస్తా తొందరగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై నేటితోనే రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. ఇలోగానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మార్చి 5 లేదా 6న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే అంటే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఏదేమైనా ఓటీటీ ఆడియెన్స్ మాత్రం 'తండేల్' మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

'తండేల్' మూవీ ఓటీటీ డిటేయిల్స్ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. రిలీజ్ కు ముందే 'తండేల్' డిజిటల్స్ రైట్స్ ను రూ.40 కోట్లతో గీతా ఆర్ట్స్ నుంచి కొనుగోలు చేయడం విశేషం. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను 'జీ తెలుగు' సొంతం చేసుకుంది. 'తండేల్' తమిళ్ డబ్బ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ను 'ది వారియర్ పిక్చర్స్' ప్రొడక్షన్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్డ్ వెర్షన్ నార్త్ ఇండియా రైట్స్ ను 'పెన్ మరుధర్' బ్యానర్ సొంతం చేసుకొని రిలీజ్ చేసింది.

ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లోనే ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతోంది. అత్యల్పంగా తమిళంలో కలెక్షన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందీ చిత్రం డే13న రూ.75 లక్షల నెట్ వసూల్ చేసింది. డే12న రూ.1.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ నిపుణుల లెక్కులు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X