Thandel OTT : ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య ‘తండేల్’... ఎక్కడ చూడాలి?

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. 'కార్తీకేయ 2' డైరెక్టర్ చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. కాగా.. బన్నీ వాసు రూ.70 కోట్లతో నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద అరాకొరగా వసూళ్లు మాత్రం రాబడుతూనే ఉంది. నాలుగు వారాలుగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇకా ఈ సినిమాకు ఆయా థియేటర్లలో ఆడియెన్స్ వస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తండేల్ చిత్రం థియేట్రికల్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. అందుకు కారణం 'తండేల్' ఓటీటీ డేట్ ఫిక్స్ కావడమే. మొత్తానికి దాదాపుగా నెలరోజుల పాటు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఎట్టకేళలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకూ మహారాజ్' వంటి చిత్రాలు ఓటీటీ సందడి చేస్తుండగా.. మార్చి 7 ఉదయం 12.01 నిమిషాల నుంచి 'తండేల్' చిత్రం కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తండేల్ ను వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. ఈరోజు థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడం.. థండేల్ సరిగ్గా ఓటీటీలోకి దిగడంతో ఆడియెన్స్ ఖుషి అవుతున్నారు.

Naga Chaitanya Sai Pallavi s Thandel Movie Released in OTT Where to Watch Here is full details

ఇక హిట్ టాక్ అందుకున్న 'తండేల్' చిత్రం ప్రస్తుతం 'ఓటీటీ'లో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇవ్వాళ్టి నుంచి ఓటీటీ ఆడియెన్స్ కోసం 'తండేల్' చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసుకుంది. రూ.40 కోట్లతో ఓటీటీ రైట్స్ ను దక్కించుకుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను పాపులర్ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తండేల్ త్వరలోనే టీవీ ఆడియెన్స్ ను కూడా అలరించనుంది.

లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. చందూ మొండేటి డైరెక్షన్, శ్రీకాకుళం మత్య్సకారుడిగా చైతూ పెర్ఫామెన్స్, సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్, బ్యూటీఫుల్ సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, ఆకట్టుకునే యాక్షన్ తో 'తండేల్'కు రిపీటెడ్ ఆడియెన్స్ ఉన్నారు. ఇక తండేల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడా ఈ చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Naga Chaitanya Sai Pallavi s Thandel Movie Released in OTT Where to Watch Here is full details

ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందే పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. టీమ్ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొని పైరసీని అడ్డుకుంది. ఆడియెన్స్ తండేల్ విషయంలో థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కోల్పోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఆడియెన్స్ నుంచే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా తండేల్ అదరో అనిపించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని ఇప్పటికే టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X