OTT: ఓటిటిలోకి సైలెంట్ గా తండేల్ .. ఎప్పుడు? ఎందులో అంటే
తెలుగు సినిమాకి ఈ ఏడాదిలోనే మంచి స్టార్ట్ దక్కింది అని చెప్పవచ్చు. ఈ కొత్త ఏడాది స్టార్ట్ అయ్యిన మొదటి రెండు వారాల్లోనే సంక్రాంతి బరిలో ముగ్గురు బిగ్ స్టార్స్ తలపడితే అందులో సీనియర్ హీరోస్ సత్తా చాటారు. ఇక ఈ జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఓ యువ హీరో వచ్చి సత్తా చాటాడు. నిజానికి అన్ని ఇండస్ట్రీలలో కూడా ఫిబ్రవరి అనే నెలని వసూళ్ల పరంగా చాలా డ్రై మంత్ గా భావిస్తారు.
అలాంటి నెలలో కూడా వచ్చి 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న అక్కినేని వారి హీరో నాగ చైతన్య. కాగా నాగ చైతన్య గత కొంత కాలం నుంచి డిజాస్టర్ సినిమాలు అందించాడు. జీరో షేర్ సినిమాలు అందించిన నాగ చైతన్య ఒక్కసారిగా సెన్సేషనల్ కం బ్యాక్ ని అందుకోవడం జరిగింది. కాగా ఆ చిత్రం తండేల్ కాగా ఈ చిత్రాన్ని కార్తికేయ దర్శకుడు చందూ మొండేటి దీనిని తెరకెక్కించారు.

నిజ జీవితంలో జరిగిన పలు సంఘటనలకు బ్యూటిఫుల్ ప్రేమ కథని అల్లి చేసిన ఈ సినిమా నాగ చైతన్య రికార్డు వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెని డామినేట్ చేసి మరీ నాగ చైతన్య సత్తా చాటాడు. ఇలా ఫైనల్ గా అదరగొట్టిన ఈ సినిమా ఎట్టకేలకి ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన తర్వాత ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేవి మేకర్స్ నుంచి కూడా పెద్దగా టాక్ రాలేదు కానీ నేడు సైలెంట్ గా ఈ చిత్రం అనౌన్సమెంట్ బయటకి వచ్చేసింది. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో వారు డేట్ ని తాజాగా అనౌన్స్ చేశారు. కాగా వీరు ఈ సినిమాని మార్చ్ 7 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా రివీల్ చేశారు.
ఒక్క తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఈ సడెన్ అనౌన్సమెంట్ ఇపుడు అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఆనందాన్ని నింపింది. ఇక ఓటిటిలో తండేల్ నుంచి కొన్ని డిలీటెడ్ సాంగ్ బిట్స్ లాంటివి అప్డేట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది.
మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ వింటేజ్ లవ్ ట్రాక్స్ ని అందించగా ఈ సినిమా సక్సెస్ లో ఇవి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. సో మొత్తానికి తండేల్ రాజు ఈ మార్చ్ 7న దుళ్లకొట్టడానికి వచ్చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించగా వీరు మొదటి నుంచీ 100 కోట్ల సినిమాని నాగ చైతన్యకి ఇస్తామని చెప్తూ నిజంగానే అందించడం గమనార్హం.
Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️
— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025
Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9


Click it and Unblock the Notifications











