Dootha Web Series: దూత వెబ్ సిరీస్ క్రేజ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. 38 భాషలతో వందలాది దేశాల్లో స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగిన ఆయన... వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓవైపు అదిరిపోయే సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేసే ఈయన తాజాగా ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అడుగు పెట్టాడు. అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ దూత వెబ్ సిరీస్ కు ఎవరూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. విడుదల అయి వారం రోజులు అవుతుండగా.. ఈ వెబ్ సిరీస్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా అక్కనేని నాగ చైతన్య తనతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కాగా.. నాగ చైతన్యకు కూడా ఇదే మొదటి వెబ్ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్లు కల్గిన ఈ వెబ్ సిరీస్ లో.. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంటుంది.

Naga Chaitanya Web Series Dootha Streaming in 38 Langugages Now Check Details

దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో శరద్ మరార్.. ప్రైమ్ వీడియోతో కలిసి దూత అనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ లో అక్కినేని నాగ చైతన్యతో పాటు పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగు భాషలో మాత్రమే విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం 38 భాషల్లో అందుబాటులో ఉందని ప్రొడ్యూసర్ శరాద్ మరార్ ప్రకటించారు.

Naga Chaitanya Web Series Dootha Streaming in 38 Langugages Now Check Details

అంతేకాకుండా ప్రస్తుతం 38 భాషల్లో సబ్ టైటిల్స్ తో సిరీస్ ప్రదర్శితం అవుతోంది. మొత్తం 240 దేశాల్లో ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్నారట. ఆడియో పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ... 38 భాషల్లో సబ్ టైటిల్స్ వేస్తూ ఈ వెబ్ సిరీస్ ను ప్రదర్శించారు. టాలీవుడ్ కు సంబంధించిన ఈ వెబ్ సిరీస్ ఈ స్థాయిలో హిట్టు కావడం ఇదే మొదటి సారి. కేవలం హిట్టు మాత్రమే కాదు... ఇన్ని దేశాల్లో, ఇన్ని భాషల్లో విడుదల అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇదే. ఇది చూస్తుంటనే దూత వెబ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.

Naga Chaitanya Web Series Dootha Streaming in 38 Langugages Now Check Details

ఇప్పటి వరకు ఈ అద్భుతమైన వెబ్ సిరీస్ ను మీరు చూసి ఉండకపోతే ఇప్పుడే చూసేయండి. మొత్తం 8 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ ప్రతీక్షణం ఉత్కంఠకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇత అద్భుతంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ మీకు కచ్చితంగా థ్రిల్ ను ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడూ ఈ వెబ్ సిరీస్ చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X