OTT: శోభిత ధూళిపాల బోల్డ్ సిరీస్ లు చూసారా? డిజప్పాయింట్ చేయని ఏ ఓటిటిలో చూడొచ్చు అంటే?
గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ సినిమా ఆడియెన్స్ లో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తున్న అంశాల్లో అక్కినేని యువ హీరో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి కోసం కూడా చెప్పాలి. కాగా నాగ చైతన్య ప్రముఖ టాలెంటెడ్ హీరోయిన్/ నటి శోభిత ధూళిపాళని వివాహం చేసుకోనున్నట్టుగా అనౌన్స్ చేయడం ట్రెండింగ్ న్యూస్ గా మారింది. కాగా ఇక్కడ నుంచి వీరి విషయంలో ఇంకా నాగ చైతన్య మాజీ భార్య సమంత కోసం కూడా పలు వార్తలు వైరల్ గా మారాయి.
అయితే సమంత నాగ చైతన్య విడిపోవడానికి ఉన్న పలు కారణాల్లో సామ్ పలు బోల్డ్ సీన్స్ ని ఓటిటి సిరీస్ లో చేయడమే కారణం అని పలు కామెంట్స్ వచ్చాయి. కానీ శోభితతో పెళ్లి అనౌన్స్ చేయడంతో సమంతపై ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చేసుకోబోతున్న శోభిత నుంచి సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 కంటే ఎక్కువ డోస్ లో చేసిన వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

కాగా ఈ వెబ్ సిరీస్ ల కోసమే మాట్లాడుకునేది.. మరి శోభిత నటించిన ఆ బోల్డ్ అండ్ మంచి కంటెంట్ తో కూడిన సిరీస్ లు రెండు ఒకే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సిరీస్ లే "మేడ్ ఇన్ హెవెన్" కాగా ఇది మొత్తం రెండు సీజన్లను కలిగి ఉంది. కాగా ఈ సిరీస్ ని ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ల కోసమే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ కొన్ని ఊహించని బోల్డ్ సీన్స్ అండ్ కంటెంట్ తో ఈ మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తుంది. అయితే రెండు సీజన్లగా ఉన్న సిరీస్ లో అయితే శోభిత ఓ రేంజ్ లో బోల్డ్ సీన్స్ ని చేసింది. ఆమె ఈ సిరీస్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్లి డబ్బున్న బిజినెస్ మ్యాన్ ని ట్రాప్ చేసి ఎలా తన లైన్ లో పెట్టుకుంది, అతని కేబిన్ లోనే శృంగారం చేయడం ఆ వీడియోని ఆమెనే లీక్ చేయడం వంటివి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆమెపై ఉంటాయి.
అయితే ఈ సిరీస్ నేపథ్యం ఏమిటంటే శోభిత తన నపుంసక ఫ్రెండ్ ఒకతినితో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ లు చేస్తుంటుందో ఒకో ఎపిసోడ్ లో ఒకో పెళ్లి ఆ పెళ్లి ఆగిపోయే సమయంలో వీరు ఎలా సెటిల్ చేసి పెళ్లిళ్లు చేస్తారు లాంటి ఆసక్తికర కథనంతో కనిపిస్తాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ అయితే అస్సలు డిజప్పాయింట్ చెయ్యని విధంగా ఉంటుంది. బోల్డ్ సీన్స్ కి బోల్డ్ సీన్స్, మంచి కంటెంట్ ఇంకా ఎమోషన్స్ తో కూడా మెప్పించేలా ఉంటుంది.

కానీ సీజన్ 2 ఓటిటిలో వచ్చిన కొన్ని రెస్ట్రిక్షన్స్ మూలాన తగ్గించి చేశారు. బట్ సీజన్ 1 డెఫినెట్ గా నచ్చుతుంది కాబట్టి సీజన్ 2 ని కూడా లాగించేయవచ్చు. మరి ఈ సిరీస్ లు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ హిందీతో పాటుగా మన తెలుగు భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నాయి. ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రే చేయవచ్చు. కాకపోతే ఫామిలీతో కాకుండా ఒంటరిగా చూడమని మేము రికమెండ్ చేస్తున్నాము..


Click it and Unblock the Notifications











