PAPA OTT: పెళ్లి తర్వాత నాగ శౌర్య సినిమా.. డిజిటల్ పార్టనర్ గా ఆ ఓటీటీ.. స్ట్రీమింగ్ మాత్రం!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఇటీవల కృష్ణవ్రింద విహారి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం అనంతరం నాగ శౌర్య నుంచి తాజాగా వచ్చిన సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ముద్దుగుమ్మ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 17న విడుదలైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు, టాక్ రావట్లేదు. ఈ నేపథ్యంలో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ఆ ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది వరుడు కావలెను, కృష్ణ వ్రింద విహారి సినిమాతో పలకరించిన నాగ శౌర్య ఈ సంవత్సరం నటించిన మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం అంటే మార్చి 17న విడుదల అయింది.

Naga Shaurya Malavika Nair Phalana Abbayi Phalana Ammayi Digital Partner Sun NXT

దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టాడు నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్. నాగ శౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా రెండోసారి జతకట్టిన 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇదివరకే ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు విడుదల తర్వాత రెస్పాన్స్ మారిపోయింది. నాగ శౌర్య, మాళవిక స్క్రీన్ పై బాగా కనిపించినప్పటికీ శ్రీనివాస్ అవసరాల మార్క్ మాత్రం పెద్దగా కనిపించలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై కూడా పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా సన్ నెక్ట్స్ (SUN NXT) ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ పార్టనర్ గా సన్ నెక్ట్స్ ప్లాట్ ఫామ్ ను చూపించినట్లుగా సమాచారం. అయితే ఇందులో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో తేదీ మాత్రం తెలియరాలేదు. కానీ సినిమా టాక్ పరంగా నాలుగు వారాలకు విడుదల చేసే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X