OTTలో అదరగొడుతున్న తెలుగు సినిమా.. వారం రోజులుగా ట్రెండింగ్
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కృష్ణవ్రింద విహారి, 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' వంటి సినిమాలతో ఫెయిల్యూర్ చూసిన నాగశౌర్య ఇటీవల రంగబలి (Rangabali) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో (Rangabali OTT) అదరగొడుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'రంగబలి'. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. దసరా ఫేమ్ షైన్ టామ్ చాకోతోపాటు శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. పవన్ సీఎస్ సంగీతం అందించారు. మొదట్లో విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రమోషన్లతో భారీ అంచనాలు పెంచేలా పెరిగాయి.

ఎన్నో అంచనాలతో జూలై 7న థియేటర్లలో విడుదలైన నాగశౌర్య రంగబలి సినిమాకు ఊహించని విధంగా నెగెటివిటీ వచ్చింది. సినిమాల్లో రొమాన్స్, కొన్ని పాటలు బాగున్నప్పటికీ అంతిమంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకోపోయిందని రివ్యూలు వచ్చాయి. ఫలితంగా రూ. 6.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ సుమారు రూ. 2 కోట్ల మేర నష్టాలను చూడాల్సి వచ్చంది. కానీ, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మాత్రం మంచి పోటీ ఏర్పడింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) రంగబలి చిత్రాన్ని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ రంగబలి సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేసింది. ఆగస్ట్ 4న డిజిటల్ వేదికపై (Rangabali in Netflix) విడుదల చేసింది. అయితే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. వరుసగా వారం రోజులపాటు ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయిందని మేకర్స్ తాజాగా అధికారికంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











