Rangabali OTT: ఆ ఓటీటీలోనే నాగశౌర్య మూవీ.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా!
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే యంగ్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభంలో లవ్ స్టోరీ మూవీలే చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ, విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'రంగబలి' అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించాడు. ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయని తెలిసిందే.

నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'రంగబలి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది. దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'స్పై' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంది 'రంగబలి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అంటే జూలై 7న విడుదలైన 'రంగబలి' ఆగస్టు 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'రంగబలి' చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా.. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











