Rangabali OTT: నెల కాకముందే ఓటీటీలోకి రంగబలి.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి!
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుతో సత్తా చాటుతున్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఒకడు. సాదాసీదాగా కెరీర్‌ను మొదలు పెట్టిన అతడు.. తక్కువ సమయంలోనే విశేషమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగశౌర్య 'రంగబలి' అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించాడు. భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'రంగబలి'. ఈ మూవీకి ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. ఫలితంగా ఈ చిత్రం చాలా తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఫలితంగా రూ. 6.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన 'రంగబలి'.. దాదాపు రూ. 2 కోట్లు వరకూ నష్టాలను చవి చూసింది.

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్ 'రంగబలి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది.
థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన నాగశౌర్య 'రంగబలి' మూవీ.. అనుకున్న సమయానికి కంటే ఓటీటీలోకి వచ్చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ మాత్రం నాలుగు వారాల తర్వాతనే స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం ఆ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని డైలాగులను, సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'రంగబలి' చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా.. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











