Naa Saami Ranga OTT: నా సామిరంగ ఓటీటీ ఇదే.. స్ట్రీమింగ్ అన్ని రోజులకే అని తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. అయితే, ఆయన ఈ మధ్య కాలంలో ఎందుకనో చాలా స్లో అయిపోయారు. అదే సమయంలో విజయాలను కూడా ఆశించిన రీతిలో అందుకోవడం లేదు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఫలితంగా ఇప్పుడు సక్సెస్ కోసం నాగ్ 'నా సామిరంగ' చేశారు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమానే 'నా సామిరంగ'. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన 'సైంధవ్' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చినట్లు తెలిసింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఈ సినిమాకు బుకింగ్స్ మోస్తరుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ టాక్ బాగుంటే అవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి నాగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా లేదా అన్నది కాసేపట్లోనే తెలియనుంది.
ఇదిలా ఉండగా.. నాగార్జున - విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో రూపొందిన 'నా సామిరంగ' మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ పార్ట్‌నర్, డేట్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీన్ని ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు అందించినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' మూవీకి సంబంధించి స్ట్రీమింగ్ గురించి ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సమాచారం ప్రకారం థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది ఫిబ్రవరి 3వ వారంలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక, నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











