Naa Saami Ranga OTT: ఫ్యాన్సీ ధరకు "నా సామి రంగా" ఓటీటీ డీల్.. ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
టాలీవుడ్ కింగ్, నవ మన్మథుడు.. నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసు కల్గిన ఈయన పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అద్భుతమైన ప్రేమ కథలతో మన ముందుకు వస్తున్నారు. ఎప్పుడూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం అంటే 2021లో బంగార్రాజు సినిమాతో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈయన తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అదే నా సామి రంగ సినిమా.
నాగార్జున హీరోగా, అషికా రంగనాథన్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదు అయ్యాయి. నాగార్జునతో పాటుగా ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరుణ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించగా.. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. దినేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేయబోతున్నారు. ఎన్నోఅంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ డిజిటల్ పార్టనర్ ను రివీల్ చేసింది. ముఖ్యంగా హీరో నాగార్జున ఫ్యాన్సీ ధరకు ఈడీల్ ను సెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
నాగార్జున హీరోగా రాబోతున్న నా సామిరంగా సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే శాటిలైట్ హక్కును స్టార్ మా తీసుకుందని కూడా తెలుస్తోంది. హిందీకి సంబంధించిన డబ్బింట్ రైట్స్ మాత్రం వేరే వాళ్ల చేతికి వెళ్లాయట. హిందీ డబ్బింగ్ రైట్స్ కాకుండానే శాటిలైట్, ఓటీటీ హక్కులు అమ్ముడు పోయినందుకు గాను మొత్తంగా 32 కోట్ల రూపాయలు వచ్చాయట. నాన్ థియేట్రికల్ హక్కులకే ఇంత రావడంతో మూవీ టీం ఫుల్ ఖుషీ అవుతోందట.

ముఖ్యంగా నా సామి రంగా సినిమాను 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారట. ఇప్పటికే 32 కోట్లు రాబట్టుకున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు థియేటర్లలో మరింత ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉన్నందుకు కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తోందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుందనేది. ఈ సినిమా టాక్ ను బట్టే ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్ అవుతుంది. ముఖ్యంగా రెండు నెలల తర్వాత వస్తుందా, 45 రోజుల తర్వాత వస్తుందా చూడాలి.


Click it and Unblock the Notifications











