OTT వారెవ్వా తస్సదియ్యా.. ఓటీటీలోకి మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్.. ఈ వారం చిల్ కొట్టుడే!
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజవ్వగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నవి రెండే చిత్రాలు. అందులో ఒకటి హనుమాన్ అయితే రెండోది నా సామి రంగ. జనవరి 13న రిలీజైన ఈ క్లీన్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లనే అందుకుంది. ఈ చిత్రంతో నాగ్ మరోసారి తన మాస్ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. అయితే ఇప్పుడీ హిట్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. బంగార్రాజు తర్వాత హిట్ అందుకోని నాగ్ ఈ సంక్రాంతికి ఎలాగైన సక్సెస్ అందుకోవాలని ఆచితూచి మరీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన సినిమాకు రెండు బడా సినిమాలు ఓ చిన్న సినిమా పోటీగా ఉన్నా కాన్ఫిడెన్స్‌తో వచ్చి మరీ సక్సెస్‌ను సాధించారు.

అతి తక్కువ సమయంలో : విశేషమేమిటంటే ఈ మూవీ షూటింగ్‌ను చాలా తక్కువ సమయంలోనే దాదాపు మూడు నెలల్లోనే కంప్లీట్ చేశారు. విజయ్ బిన్నీ దీనికి దర్శకత్వం వహించారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా హాస్యనటుడు. అల్లరి నరేశ్, యంగ్ హీరో రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా చిత్రంలో నాజర్, మలయాళ నటుడు షబ్బీర్ కలరక్కాల్, రవి వర్మ, రావు రమేశ్, మధు సూదన్ రావ్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు

స్ట్రీమింగ్‌కు రెడీ : చాలా కాలం తర్వాత నాగార్జున సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీలోకి రాబోతుంది.
డోంట్ మిస్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చేసింది. త్వరలోనే నా సామిరంగ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు వదలబోతున్నట్లు వీడియోను పోస్ట్ చేసింది. అయితే స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం చెప్పలేదు. కానీ ఫిబ్రవరి 16 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఓటీటీ వర్గాలు అంటున్నాయి. మరి థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన నా సామిరంగ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి. ఒకవేళ మీరు థియేటర్లో ఈ చిత్రాన్ని మిస్ అయి ఉంటే మాత్రం ఎంచక్కా ఓటీటీలో చూసేయండి..


Click it and Unblock the Notifications











