ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ: నా సామిరంగ డేట్ వచ్చేసింది
టాలీవుడ్‌లోని కుర్ర హీరోల కంటే సీనియర్లు కాస్త వేగంగా సినిమాలు చేస్తున్నారు. అందులో గతంలో కంటే కాస్త స్లో అయ్యారు కింగ్ అక్కినేని నాగార్జున. ఒకప్పుడు ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేసిన ఆయన.. ఇప్పుడు ఆ స్పీడ్‌ను అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాగార్జున 'నా సామిరంగ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీనే 'నా సామిరంగ'. ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అయిన ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'నా సామిరంగ' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 22 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రం ద్వారా రూ. 3 కోట్లు వరకూ లాభాలు కూడా సొంతం అయ్యాయి.
నాగార్జున - విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో రూపొందిన 'నా సామిరంగ' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు అందించింది. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఇటీవలే స్పందించిన హాట్‌స్టార్.. తాజాగా డేట్‌ను కూడా ప్రకటించేసింది.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' మూవీని ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నాగార్జున మీసం మెలేస్తున్న ఓ క్లిప్‌ను కూడా షేర్ చేసింది. ఇక, ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











