ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ: అవేమీ లేకుండానే స్ట్రీమింగ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోలు వరుసగా ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఒక్కరు మాత్రమే గతంలో కంటే బాగా స్లో అయ్యారు. ఆయనే కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో నెమ్మదిగా సినిమాలు చేస్తోన్న ఈ బడా హీరో.. గత సంక్రాంతికి 'నా సామిరంగ' అనే మాస్ అండ్ ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' సినిమాను ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెరకెక్కించాడు. మాస్ అండ్ ఫ్యామిలీ అంశాలతో కూడిన కథతో వచ్చిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీగా పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'నా సామిరంగ' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 22 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రం ద్వారా రూ. 3 కోట్లు వరకూ లాభాలు కూడా ఖాతాలో వేసేసుకుంది.
నాగార్జున - విజయ్ బిన్నీ కలయికలో తెరకెక్కిన 'నా సామిరంగ' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు అందించింది. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఇటీవలే స్పందించిన హాట్‌స్టార్.. తాజాగా డేట్‌ను కూడా ప్రకటించేసింది.
మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'నా సామిరంగ' మూవీని ముందుగా ప్రకటించినట్లుగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గత అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. అయితే, ఇందులో ఎలాంటి సీన్స్‌ను యాడ్ చేయలేదు. థియేటర్లలో వచ్చిన వెర్షన్‌నే తీసుకు వచ్చారు. అయినప్పటికీ ఈ చిత్రానికి హాట్‌స్టార్‌లో మాత్రం మంచి స్పందనే లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











