The Ghost OTT: అప్పుడే ఓటీటీలోకి ది ఘోస్ట్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే!
అక్కినేని నాగేశ్వర్రావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో ఏర్పరచుకున్నాడు. దీంతో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో నాగార్జున సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు.
కొంత కాలంగా భారీ విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతోన్న ఆయన.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇటీవలే 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి అనుకున్న రీతిలో టాక్ రాలేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై చూపించింది. ఫలితంగా ఈ చిత్రానికి చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ఫుల్ రన్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మిక్స్‌డ్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయిన అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రకలా వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. 'ది ఘోస్ట్' మూవీని నవంబర్ 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. అంటే.. ఈ సినిమా విడుదలైన నెల రోజులు కూడా కాకముందే స్ట్రీమింగ్ కాబోతుందన్న మాట.
'ది ఘోస్ట్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మరికొందరు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











