ఫ్రెండ్స్ టూర్ కాళరాత్రిలా మారితే.. ఓటీటీలోకి వచ్చేసిన భయపెట్టే థ్రిల్లర్ మూవీ
గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందుకే కొత్త కొత్త కాన్సెప్టులతో ఎక్కువగా సినిమాలు రూపొందుతున్నాయి. మరీ ముఖ్యంగా హర్రర్ అండ్ థ్రిల్లర్ స్టోరీలతో అధిక సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటికి మంచి స్పందన కూడా లభిస్తోంది. అలాంటి ఓ సినిమానే 'నల్లా నిలవుల్లా రాత్రి' (Nalla Nilavulla Rathri).
చెంబన్ వినోద్ జోస్, బాబూరాజ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో మలయాళంలో రూపొందిన చిత్రమే 'నల్లా నిలవుల్లా రాత్రి'. ఈ క్రేజీ కాన్సెప్ట్ సినిమాను మర్ఫీ దేవసి తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని 2023 జూన్ 30 తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో రూపొందిన 'నల్లా నిలవుల్లా రాత్రి' సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో దీన్ని తమ తమ భాషల్లోకి డబ్బింగ్ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దీన్ని ఆహా సంస్థ తెలుగులోకి తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
ఆద్యంతం ఆసక్తిని రేపేలా అదిరిపోయే ట్విస్టులతో సాగే కథతో రూపొందిన 'నల్లా నిలవుల్లా రాత్రి' సినిమా ఇప్పటికే ఓటీటీలో సైతం విడుదలైంది. అక్కడ కూడా ఇది మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్ చేయబోతున్నారు. 'కాళరాత్రి' అనే టైటిల్‌తో దీన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ సంస్థ ఆహా అందుబాటులోకి వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'కాళరాత్రి' సినిమాను ఆహా సంస్థ గత అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కూడా ఈ చిత్రానికి ఓటీటీలో మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా... సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో రూపొందిన 'కాళరాత్రి' సినిమాను తెలుగులో హనుమాన్ మీడియా బ్యానర్‌పై బాలు చరణ్ తీసుకు వచ్చారు. కైలాస్ మీనన్ ఈ మూవీకి మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు. ఇందులో సజిన్ చెరుకైల్, జిను జోసెఫ్, గణపతి ఎస్ పొదువల్, రోనీ డేవిడ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications