Pawan Kalyan.. ఇక నీ మూడు పెళ్లిళ్లపై వాగితే.. వాళ్లు ఊరకుక్కలే.. బాలకృష్ణ హాట్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2 సీజన్ సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. తొలి సీజన్ కంటే.. రెండో సీజన్ క్రేజీగా సాగుతున్నది. ప్రభాస్, గోపిచంద్‌తో వచ్చిన ఇంటర్వ్యూ రికార్డులు క్రియేట్ చేస్తుంటే..త్వరలోనే ఓటీటీలో సునామీ సృష్టించేందుకు పవన్ కల్యాణ్‌తో బాలయ్య చేసిన ఎపిసోడ్ సిద్దమవుతున్నది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌లో సంచలనాత్మక రీతిలో పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడనేది తాజా సమాచారం. ఆ వివారాల్లోకి వెళితే..

టాక్ షోలకే అమ్మ మొగుడిగా
అన్‌స్టాపబుల్ 2 షో దేశంలోనే అత్యుత్తమ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. టాక్ షోలోకే అమ్మ మొగుడుగా నిలిచిందని స్వయంగా బాలకృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఒక తెలుగు టాక్ షోకు దేశంలోనే టాప్ రేటింగ్ రావడం ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నది. రెండో సీజన్ చాలా క్రేజీగా, కాంట్రవర్షియల్‌గా నిలిచింది.

సీజన్ 2 బ్రహ్మండంగా
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ రెండో సీజన్ సంచలనాత్మకమైన రీతిలోప్రారంభమైంది. చంద్రబాబు, లోకేష్‌తో కలిపి చేసిన ఎపిసోడ్ చరిత్రలో ప్రశ్నార్థకంగా నిలిచిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ రేంజ్‌లోనే కంటెంట్‌ను రెడీ చేశారు.

మీడియా, అభిమానుల హంగామా
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఒక భారీ బడ్జెట్ సినిమా ఒపెనింగ్‌ను తలపించేలా ఎపిసోడ్‌ను క్రేజీగా చేశారు. మీడియా, అభిమానుల హంగామా మధ్య రచ్చ రచ్చగా ఒపెన్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్, రాంచరణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. అయితే ఈ షోలో అడిగిన ప్రశ్నలు ఇప్పటికే యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇప్పటం గ్రామ ప్రజలతో
ఇక పవన్ కల్యాణ్ హాజరైన అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్‌లో ఇటీవల వివాదంగా మారిన ఇప్పటం గ్రామ ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. ఇప్పటం గ్రామానికి చెందిన ఓ పెద్దవ్యను కూడా ఆహ్వానించారు. అయితే ఇప్పటం గ్రామంపై ఏపీ సర్కార్ చేస్తున్న అసత్య ఆరోపణలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై
ఇక పవన్ కల్యాణ్, ఆయన మూడు పెళ్లిళ్లపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని తెలిసింది. మూడు పెళ్లిళ్లు, విడాకుల విషయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన క్లారిటీ ఎమోషనల్‌గా ఉందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ ఎమోషనల్ అవుతూ.. ఇక ఇంకా నీ మూడు పెళ్లిళ్లపై ఎవడైనా కామెంట్ చేస్తే ఊరకుక్కే.. ఎవరైనా మాట్లాడితే వాళ్లంతా ఊరకుక్కలే అని బాలకృష్ణ కామెంట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలు ఎపిసోడ్‌లో ఉంటాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











