NBK 108: బాలయ్య నిర్మాతలకు జాక్ పాట్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్!

ఈ మధ్య బాలకృష్ణకి టైం భలే కలిసి వస్తోంది. ఆయనను నమ్మిన దైవ బలమో... లేక జాతక బలమో తెలియదు కానీ... ఏది పట్టుకుంటే అది బంగారమైన నిలుస్తోంది. ముందుగా అఖండ సినిమా సూపర్ హిట్ కావడం తర్వాత అన్ స్టాపబుల్ విత్ NBK షో బ్లాక్ బస్టర్ హీట్ కావడం బాగా కలిసి వచ్చాయి. ఆ దెబ్బతో రొటీన్ సినిమా అయినా సరే వీరసింహారెడ్డి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది.

దానికి ఈ సంక్రాంతి సీజన్ కూడా కలిసి వచ్చింది అనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్యనే ఐపీఎల్ లో కూడా బాలకృష్ణ మొదటి రోజు తెలుగు కామెంట్రేటర్ గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు. ఇలా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ క్రేజ్ అనిల్ రావిపూడి సినిమాకి బాగా కలిసి వస్తోంది అని తెలుస్తోంది.

ఇప్పటివరకు అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతూ ఉండడం శ్రీ లీల నటిస్తూ ఉండడంతో సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఆసక్తికరమైన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఇంకా షూటింగ్ కూడా పూర్తికాకముందే ఫాన్సీ రేటుకు అమ్మేసినట్టు తెలుస్తోంది.

Nandamuri balakrishna 108 project digital rights latest update

అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థకు దాదాపు 36 కోట్ల మేరకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మినట్లుగా చెబుతున్నారు. నిజానికి సినిమాకి సంబంధించిన మిగతా బిజినెస్ ఏది మొదలు కాలేదు సాటిలైట్ హిందీ డబ్బింగ్ ఆడియో రైట్స్ అలా ఉండగానే డిజిటల్ లో ఏర్పడిన డిమాండ్ కు తగినట్టుగానే 36 కోట్ల రూపాయల మేరకు అమ్మేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అవుతూ ఉండడంతో నాన్ థియేటర్ మీద 60 నుంచి 70 కోట్లు వసూలు చేసుకోవాలి అప్పుడు థియేటర్ బిజినెస్ మీద ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. భాగంగానే 36 కోట్లకు ఈ హక్కులమ్మినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X